Prudhvi Raj : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎన్నికైనప్పటి నుంచి ఆయన ఆధ్వర్యంలో ఒక్క కార్యక్రమం కూడా చేపట్టలేదు. మరోవైపు ఏపీలో సినిమా టిక్కెట్ల ధరలపై ఎలాంటి పోరాటం చేయలేదు. దీంతో ఈ మధ్య కాలంలో మంచు ఫ్యామిలీని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అయితే అలాంటి విమర్శలకు చెక్ పెట్టేలా మంచు విష్ణు ప్రస్తుతం దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగానే ఆయన ఇటీవల మా సభ్యులకు ఏఐజీ హాస్పిటల్స్ సహకారంతో ప్రత్యేక మెడికల్ క్యాంప్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా మంచు విష్ణు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
6 నెలల్లో మా అసోసియేషన్ బిల్డింగ్ కు భూమి పూజ చేస్తామని మంచు విష్ణు ఈ సందర్భంగా అన్నారు. అలాగే టిక్కెట్ల ధరలపై కూడా అందరూ కలసి కూర్చుని మాట్లాడుకుంటే బాగుంటుందని అన్నారు. ఇక ఇదే కార్యక్రమంలో కమెడియన్ పృథ్వి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మంచు విష్ణును పొగడ్తల్లో ముంచెత్తారు. మంచు విష్ణు ఒక ప్లానింగ్ ఉన్న వ్యక్తి అని.. ఆయన ఏం చేసినా ఒక ప్లాన్ ప్రకారం చేస్తారని అన్నారు.
మంచు విష్ణు ఇప్పటికే తమకు ఉన్న విద్యాసంస్థలను ఎంతో సులభంగా నిర్వహిస్తున్నారని.. కనుక మా అసోసియేషన్‌ను నిర్వహించడం అతనికి పెద్ద కష్టమేమీ కాదని.. చాలా సులభంగా పనిచేయగలడని అన్నారు. ఇక పృథ్వి ఇటీవలే మెగాస్టార్ చిరంజీవిపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మొదటి నుంచి మెగా ఫ్యామిలీ అభిమానినే అని.. కొందరి ప్రోద్బలం వల్ల వారికి వ్యతిరేకంగా వెళ్లాల్సి వచ్చిందని.. తను మెగాస్టార్ ఆదుకోవాలని ఆయన కోరారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…