Bhimla Nayak : కరోనా కారణంగా అనేక పెద్ద సినిమాలు వాయిదా పడిన విషయం విదితమే. ఈ క్రమంలోనే ఒక్క చిత్ర యూనిట్ తమ సినిమాను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాయి. పలువురు మేకర్స్ తమ చిత్రాలకు గాను కొత్త రిలీజ్ డేట్లను కూడా ప్రకటించేశారు. అయితే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చిత్రం విడుదలపై అందరిలోనూ సందేహాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ఈ చిత్ర నిర్మాత ఎస్.నాగవంశీ తాజాగా జరిగిన మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
నాగ వంశీ నిర్మాణంలో తెరకెక్కిన తాజా చిత్రం డీజే టిల్లు. ఈయన భీమ్లా నాయక్ నిర్మాత కూడా. డీజే టిల్లు మూవీ ఫిబ్రవరి 11వ తేదీన విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో నాగ వంశీ మాట్లాడుతూ.. తాను భీమ్లా నాయక్ చిత్రం విడుదల కోసం ఎదురు చూస్తున్నానని అన్నారు.
భీమ్లా నాయక్ విడుదలకు గాను రెండు తేదీలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్ 1వ తేదీన ఈ మూవీని విడుదల చేయాలని అనుకుంటున్నామని.. అయితే దీనిపై సీఎం జగన్‌ను అడిగితే బాగుంటుందని అన్నారు. ఆయన నిర్ణయంపైనే భీమ్లా నాయక్ విడుదల ఆధారపడి ఉందన్నారు. రాష్ట్రంలో 50 శాతం ఆక్యుపెన్సీ రూల్, రాత్రి కర్ఫ్యూలను ఎత్తేస్తేనే భీమ్లా నాయక్ విడుదల అవుతుందని తెలిపారు.
ఇక డీజే టిల్లు యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ అని, భీమ్లానాయక్ మాస్ మూవీ అని అన్నారు. డీజే టిల్లు చైనీస్ ఫాస్ట్ ఫుడ్ అయితే.. భీమ్లా నాయక్ ఆంధ్రా మీల్స్ వంటిదని నాగ వంశీ అన్నారు. ఈ క్రమంలో సీఎం జగన్ థియేటర్ల విషయంలో తీసుకునే నిర్ణయంపైనే భీమ్లా నాయక్ విడుదల ఆధార పడి ఉందని స్పష్టమైంది. మరి భీమ్లా నాయక్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…