Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. బాహుబలి సినిమా తర్వాత ఆయన రేంజ్ పూర్తిగా మారింది. త్వరలో రాధే శ్యామ్ చిత్రంతో ప్రేక్షకులని పలకరించనున్నాడు ప్రభాస్. ప్రభాస్ 42వ పుట్టినరోజు సందర్భంగా యూవీ క్రియేషన్స్ ఒక సరికొత్త టీజర్ విడుదల చేస్తుందని ఎవరూ ఊహించలేదు. మొత్తానికి టీజర్ అయితే అభిమానులకు బాగా నచ్చింది.
ప్రస్తుతం సలార్, ఆదిపురుష్ చిత్రాలతో బిజీగా ఉన్న ప్రభాస్ త్వరలో ప్రాజెక్ట్ కె అనే చిత్రంతోపాటు స్పిరిట్ అనే చిత్రాలు చేయనున్నాడు. ఈ సినిమాలపై అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఆయనకు సంబంధించి అనేక ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు కూడా ఫేవరెట్ మూవీస్ ఉండగా, వాటిని ఏకంగా 20 సార్లు చూశాడట ప్రభాస్.
ప్రభాస్ ఫేవరెట్ హీరో రాబర్ట్ డే నీరో కాగా, ఈయన హాలీవుడ్ హీరో. ఆయన సినిమాలు బాగా చూస్తాడు. ఇక ఇండియా లో రాజ్ కుమార్ హిరానీ సినిమాలు చూడడానికి బాగా ఇష్టపడతాడు ప్రభాస్. అందులో భాగంగానే ఆయన నటించిన మున్నాభాయ్ ఎంబీబీఎస్, 3 ఇడియట్స్ అనే సినిమాలను దాదాపుగా 20 సార్లు వీక్షించాడట. ఈ విషయం తెలిసి అభిమానులు షాక్ అవుతున్నారు. ప్రభాస్ బాలీవుడ్‌లో పాగా వేసేందుకు ప్రభాస్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…