Radhe Shyam Teaser : ప్రభాస్ సినిమాలకు చెందిన అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలోనే త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న రాధేశ్యామ్ మూవీపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. అయితే శనివారం (అక్టోబర్ 23, 2021) ప్రభాస్ బర్త్ డే జరుపుకుంటున్న సందర్భంగా రాధే శ్యామ్ కు చెందిన టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో అదరిపోయే డైలాగ్స్ ఉండడం విశేషం.
అన్నీ నాకు తెలుసు అంటూనే.. నేను ఏమీ చెప్పను. కానీ నేను దేవున్నికాదు, అది మీ ఊహకు కూడా అందదు.. అంటూ ప్రభాస్ ఈ టీజర్ లో డైలాగ్స్ చెప్పారు. ఇక ఇందులో పామిస్ట్ విక్రమాదిత్యగా ప్రభాస్ కనిపిస్తున్నట్లు రివీల్ చేశారు. దీంతో ఈ మూవీపై అభిమానాల్లో ఇంకా అంచనాలు పెరిగిపోయాయి.
రాధేశ్యామ్ మూవీలో ప్రభాస్ సరసన పూజా హెగ్డె నటిస్తుండగా.. ఈ మూవీకి రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, గోపీ కృష్ణ మూవీస్ సంయుక్త ఆధ్వర్యంలో అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ మూవీ జనవరి 14న థియేటర్లలో విడుదల కానుంది. తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడం, మళయాళం భాషల్లో ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. కాగా తాజాగా విడుదల చేసిన టీజర్‌కు అభిమానుల నుంచి క్రేజీగా రెస్పాన్స్ వస్తోంది. సోషల్ మీడియా మొత్తం ప్రభాస్, రాధేశ్యామ్ నామస్మరణతో మోత మోగిపోతోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…