Prabhas On Om Raut : ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఓమ్ రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విజువల్ వండర్.. ఆదిపురుష్. ఈ సినిమాపై మొదట్నుంచీ అభిమానుల్లో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. వాస్తవానికి ఈ మూవీ ఎప్పుడో రిలీజ్ కావల్సి ఉంది. కానీ అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. వచ్చే ఏడాది జనవరి 12న ఎట్టకేలకు ఈ మూవీని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే అక్టోబర్ 2న ఆదిపురుష్ టీజర్‌ను వదిలారు. అయితే ఈ మూవీ యామినేషన్ మూవీ కావడం.. అయినప్పటికీ గ్రాఫిక్స్ కూడా పరమ చెత్తగా ఉండడంతో సినీ ప్రేక్షకులే కాదు.. అటు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మరోవైపు ఈ టీజర్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్, విమర్శలు భారీగానే వస్తున్నాయి.
ఆదిపురుష్ తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మళయాళం భాషల్లోనూ రిలీజ్ కానుంది. ఆ భాషల్లోనూ టీజర్‌ను వదిలారు. అయితే ఆయా భాషలకు చెందిన ప్రేక్షకులకు కూడా ఈ టీజర్ నచ్చలేదు. దీంతో దేశవ్యాప్తంగా మూవీకి చుక్కలు కనిపిస్తున్నాయి. ప్రేక్షకులు, అభిమానులు చిత్ర యూనిట్‌ను ఏకి పారేస్తున్నారు. ముఖ్యంగా తానాజీ వంటి బ్లాక్ బస్టర్ హిట్‌ను తెరకెక్కించిన ఓమ్ రౌత్ సినిమాను ఇంత నాసిరకంగా తీశాడేమిటి.. అని అందరూ ఆయనను విమర్శిస్తున్నారు. అయితే తాజాగా ప్రభాస్ ఓమ్.. కమ్ టు మై రూమ్ అని పిలుస్తున్న ఓ వీడియో బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది. దీంతో దర్శకుడు ఓమ్ రౌత్‌పై ప్రభాస్ తీవ్ర ఆగ్రహంగా ఉన్నాడని చెబుతూ.. ఈ వీడియోను జత చేసి షేర్ చేస్తున్నారు.
అయితే వాస్తవానికి ప్రభాస్ కోపంగా అన్నమాటలు కావని.. వారు పార్టీ చేసుకున్నారని.. ఆ సమయంలో కాస్త మద్యం సేవించి ఉన్న ప్రభాస్ అలా పిలిచేసరికి అందరికీ దర్శకుడు ఓమ్ రౌత్‌ను ప్రభాస్ కోపంగా పిలిచినట్లు అనిపించిందని.. ఇందులో వివాదం ఏమీ లేదని.. అయితే అసలు ఈ వీడియో ఎక్కడిది.. దీన్ని ఎవరు షూట్ చేశారు.. అన్న సందేహం కూడా కలుగుతోంది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ అవుతోంది. అయితే చిత్ర రిలీజ్ తేదీ దగ్గరగానే ఉండడం.. మరోవైపు టీజర్‌పైనే ఇలా భారీగా విమర్శలు వస్తుండడంతో.. చిత్ర యూనిట్ ఏం చేస్తుందన్నది.. ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…