Prabhas : టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అంటే సినీ ఇండస్ట్రీతోపాటు ఆయన డై హార్డ్ ఫ్యాన్స్ కి ప్రత్యేకమైన అభిమానం. కనుక ప్రభాస్ కు సంబంధించిన ఎలాంటి విషయం అయినా సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. ఆయన యాక్టింగ్, స్టైలిష్ లుక్స్, ఫైట్స్ తో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్ ఓ రేంజ్ తో ముందుకు దూసుకుపోతున్నారు.
సీనియర్ రెబల్ స్టార్ పేరును ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నాడు. అంతటి ఘనత సాధించిన ప్రభాస్ టాలీవుడ్ ఇండస్ట్రీతోపాటు ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నాడు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన లేటెస్ట్ సినిమాల నుండి వచ్చే అప్డేట్స్ కోసం ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన జాతకం ఎలా ఉందో తెలియజేసే వార్త ఒకటి తెగ వైరల్ అవుతోంది.
1979 అక్టోబర్ 23న ప్రభాస్ జన్మించిన నక్షత్రం, రాశి ప్రకారం చూస్తే ప్రభాస్ మహర్జాతకుడు అని అంటున్నారు జ్యోతిష్యులు. రెబల్ అనే సినిమాలో ప్రభాస్ తండ్రిగా నటించిన కృష్టంరాజు ప్రభాస్ పుట్టిన రోజున జాతకం చూసేందుకు ఎంతోమంది జ్యోతిష్యులను పిలిపించి జాతకం చూపిస్తారు. అలాగే రియల్ లైఫ్ లో కూడా ప్రభాస్ పుట్టినరోజున ఆయన జాతకం గురించి ఇంట్రెస్టింగ్ విశేషాలు తెలిపారు. అయితే ప్రభాస్ జాతకం అత్యద్భుతంగా ఉందని, కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ గా ఎదిగిన ఎం.జి. రామచంద్రన్ జాతకంలా ప్రభాస్ జాతకం ఉందని చెప్పారు.
అంతేకాకుండా ప్రభాస్ దేశం గర్వపడేలా ఎదుగుతారని అన్నారు. సినీ చరిత్రలో ఎమ్జీఆర్, ఎన్టీఆర్, రజనీకాంత్ లు ఎంత గొప్ప గుర్తింపును పొందారో.. రెబల్ స్టార్ ప్రభాస్ కూడా అంతే గుర్తింపు సంపాదించుకుంటారని జ్యోతిష్యులు తెలిపారు. అలాగే ఆయన పెళ్ళి గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ప్రభాస్ కు 2023 లో పెళ్ళి జరుగుతుందని అన్నారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…