Posani Krishna Murali : నటుడు, రచయిత, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి ఎల్లప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. ఆయన ఎప్పుడూ ఏవో ఒక కామెంట్స్ చేస్తుంటారు. దీంతో ఆయన వివాదాల్లో నిలుస్తుంటారు. అప్పట్లో పవన్ ఏపీ ప్రభుత్వం, మంత్రులపై చేసిన కామెంట్లకు పోసాని స్పందించారు. దీంతో కొందరు వ్యక్తులు పోసాని ఇంటిపై రాళ్ల దాడి చేశారు. ఆ తరువాత ఆ వివాదం సద్దుమణిగింది. అయితే తాజాగా మళ్లీ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ప్రముఖ నటుడు మోహన్ బాబు నటించిన సన్ ఆఫ్ ఇండియా మూవీ నెల 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను తాజాగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన పోసాని కృష్ణమురళి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
తాను పరుచూరి బ్రదర్స్ దగ్గర సుమారుగా 5 ఏళ్ల పాటు పనిచేశానని పోసాని తెలిపారు. ఆ సమయంలోనే తనకు మోహన్ బాబుతో పరిచయం అయిందని అన్నారు. అయితే పరుచూరి బ్రదర్స్ నుంచి తాను చాలా నేర్చుకున్నానని.. కానీ వారిలా మాత్రం బతకాలని కోరుకోవడం లేదని అన్నారు. వాళ్లకు అసలు బతకడం అంటే ఏమిటో తెలియదని, అలాంటి వాళ్లను ఇండస్ట్రీ ఎందుకు పక్కన పెట్టిందో తనకు తెలుసని అన్నారు.
అలాగే పరుచూరి, ఆత్రేయ, వేటూరి లాంటి వాళ్ళని చూసి ఈ బతుకు నాకు వద్దు అని అనుకున్నానని తెలిపారు. కనీసం చనిపోయిన సమయంలోనూ పట్టుమని పది రాని ఇండస్ట్రీ గురించి తనకు బాగా తెలుసని, తనను ఇండస్ట్రీ నిషేధించినా ఫర్వాలేదు, తన సంతానం, వారి సంతానం బతికేంతగా సంపాదించానని తెలిపారు. కొందరికి మందు పోసి చికెన్ అందించే బతుకు తనకొద్దు అని పోసాని అన్నారు. అయితే ప్రస్తుతం ఏపీలో సినిమా టిక్కెట్ల ధరల విషయంలో చిరంజీవి జగన్‌ను కలిసిన అంశంపై ఆయనకు, మోహన్‌బాబుకు మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఈ దశలో పోసాని చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…