Poorna : బుల్లితెరపై అత్యంత విజయవంతంగా కొనసాగుతున్న రియాలిటీ షోలలో ఢీ ఒకటి. ఇందులో కేవలం డ్యాన్స్‌లు మాత్రమే కాదు.. కామెడీ, గ్లామర్, రొమాన్స్ అన్నీ కలగలపి ఉంటాయి. కనుకనే ప్రేక్షకులు ఈ షోను ఆదరిస్తున్నారు. ఇక ఇందులో ప్రదీప్, సుదీర్, హైపర్ ఆది వంటి వారు కూడా సందడి చేస్తున్నారు. అలాగే రష్మి, దీపికా పిల్లి, పూర్ణ, ప్రియమణి గ్లామర్ షోలు ఈ షోకు ప్రధాన ఆకర్షణలని చెప్పవచ్చు. అయితే ఢీ సీజన్ 13లో అలరించిన పూర్ణ లేటెస్ట్ 14వ సీజన్‌లో మాత్రం కనిపించడం లేదు. దీంతో పూర్ణ ఎందుకు తప్పుకుంది ? లేక ఆమెను కావాలనే తప్పించారా ? ఆమె ఉంటే షోకు మంచి రేటింగ్స్ వస్తున్నాయి కదా.. అనవసరంగా ఎందుకు తీసేశారు ? అని ప్రేక్షకుల మనస్సుల్లో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే వీటన్నింటికీ పూర్ణ ఒక డైలాగ్‌తో సమాధానం చెప్పింది.
ఢీ షో మంచి టీమ్‌తో దూసుకుపోతుండగా.. ఇందులో కొన్ని మార్పులు చేశారు. హైపర్ ఆది, ప్రదీప్, ప్రియమణి తప్ప మిగిలిన అందరినీ తీసేశారు. వారిలో పూర్ణ ఒకరు. ఈమె జడ్జిగా కనిపించేది. కానీ ఢీ 14లో లేదు. దీంతో ఇలా ఉన్నపళంగా అందరినీ ఎందుకు తీసేశారో అర్థం కాలేదు. అయితే పూర్ణనే స్వచ్ఛందంగా ఈ షో నుంచి తప్పుకుంది. ఈ మేరకు ఆమె స్పష్టంగా చెప్పేసింది.
ఢీ సీజన్ 14 నుంచి తప్పుకునన్నట్లు పూర్ణ వెల్లడించింది. శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి వచ్చిన ఈమె ఈ విషయాన్ని తెలియజేసింది. శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ఎపిసోడ్‌కి రష్మి, పూర్ణ వచ్చారు. దీంతో వీరికి ఆది, రామ్ ప్రసాద్‌లు స్వాగతం పలికారు. ఇక హైపర్ ఆది ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ఈ షోకి కొత్తగా వచ్చిన యాంకర్ ఎవరైనా మా అన్నకు హగ్గు ఇవ్వాలని కోరాడు. దీంతో స్పందించిన పూర్ణ మాట్లాడుతూ.. ఈ హగ్గులు ఇవ్వలేకనే ఢీ షో నుంచి బయటకు వచ్చాను. ఇక్కడ కూడా హగ్గులు ఇవ్వాలంటే నా వల్ల కాదు.. ఈ షోను కూడా మానేస్తా.. అని పూర్ణ వ్యాఖ్యలు చేసింది. దీంతో ఈమె ఈ కామెంట్స్‌ను కామెడీ కోసం అన్నదా.. లేక నిజంగానే అక్కడ అంత వ్యవహారం జరగుతుందా.. అని ప్రేక్షకులు ఆలోచిస్తున్నారు.
అయితే వాస్తవానికి రియాలిటీ షోలు అన్నింటిలోనూ డైరెక్టర్స్ చెప్పినట్లు చేయాలి. కనుక హగ్గులు ఇవ్వాలంటే ముందుగానే చెబుతారు కాబట్టి పూర్ణ అన్నీ తెలిసే చేస్తున్నట్లు లెక్క. మరి అంతమాత్రానికి హగ్గులు ఇవ్వలేక బయటకి వచ్చేశాను.. అని అనడం దేనికి. అంటే తనకు ఇష్టం లేకపోయినా అక్కడి వారు అలా చేయిస్తున్నారు.. అని అర్థం చేసుకోవచ్చు. ఏది ఏమైనా పూర్ణ వ్యాఖ్యలు మాత్రం సంచలనం కలిగిస్తున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…