Poorna : పూర్ణ పెళ్లి క్యాన్సిల్ అయిందా.. క్లారిటీ ఇచ్చేసిందిగా..!

Poorna : ఇటీవల కాలంలో సినిమా తారల పెళ్లిళ్లు పెటాకులవడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే చాలా మంది తారలు తమ వివాహ బంధానికి గుడ్ బై చెప్పి సినిమాలతో బిజీ అయిపోతున్నారు. మరికొందరైతే ఎంగేజ్ మెంట్ చేసుకున్న తర్వాత పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటున్నారు. రష్మిక, మెహరీన్ ఇలా కొంతమంది పెళ్లిపీటలెక్కకుండానే విడిపోయారు. తాజాగా ఈ లిస్ట్ లోకి ఓ అమ్మడు వచ్చి చేరిందని వార్తలు వినిపిస్తున్నాయి.

రఘుబాబు తెరకెక్కించిన అవును సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ పూర్ణ. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన‌ప్పటికీ ఆశించిన స్థాయిలో క్లిక్ అవ్వలేక పోయింది. చాలా రోజుల తర్వాత రీసెంట్ గా బాలయ్య బాబు నటించిన అఖండ సినిమాలో కీలక పాత్రలో నటించి మెప్పించింది పూర్ణ.

Poorna

అయితే ఈ ఏడాది జూన్ నెలలో తనకు కాబోయే భర్తను ఆమె పరిచయం చేసిన సంగతి తెలిసిందే. షానిద్ అసిఫ్ ఆలీ అనే వ్యక్తితో ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు ఆమె సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. కాబోయే భర్తతో కలిసి దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. అయితే ఆ తరువాత పెళ్లిపై ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు. దీంతో పూర్ణకు, షానిద్‌కు మధ్య విభేదాలు వచ్చాయని.. నిశ్చాతార్థం క్యాన్సిల్ అయిందంటూ సోషల్ మీడియాలో వార్తలు స్ప్రెడ్ చేశారు కొంతమంది.

ఈ నేపథ్యంలో పెళ్లి రద్దయిందంటూ వస్తున్న రూమర్స్ కి చెక్ పెట్టింది పూర్ణ. తనకు కాబోయే భర్తతో కలిసి దిగి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. అతడెప్పటికీ నా వాడే అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో అందరి నోళ్ళకు తాళం పడినట్టైంది. ఇటు బుల్లితెరపై షోలతో బిజీగా ఉంటోంది పూర్ణ. త్వరలో దసరా, బ్యాక్‌ డోర్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Share
Usha Rani

నా పేరు ఉషారాణి. పుస్తకాలు చదవడం, సినిమాలు చూడడం అంటే ఇష్టం. సాహిత్యంపై నాకు కొంత అవగాహన ఉండడంతో రాయాలి అనే ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ లో కంటెంట్ రైటర్ గా చేస్తున్నాను.

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM