Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ మధ్య ఓ కార్యక్రమంలో భాగంగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాను మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడని అందరూ అంటున్నారని.. అయితే విడాకులు ఇచ్చాకే పెళ్లి చేసుకున్నానని.. తన మొదటి, రెండో భార్యలకు ఆస్తులను, డబ్బును ఇచ్చానని పవన్ చెప్పుకొచ్చారు. దీంతో ఈ టాపిక్ మళ్లీ తెర మీదకు వచ్చింది. అయితే పవన్ మూడో భార్య అయిన అన్నా లెజినీవా ఆస్తుల వివరాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. పవర్ స్టార్ వపన్ కల్యాణ్ రష్యా దేశస్థురాలు అన్నా లెజినీవాను ప్రేమవివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
తీన్మార్ సినిమాలో అన్నా లెజినీవా నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే పవన్ కల్యాణ్ ఆమెతో ప్రేమలో పడ్డారు. ఈ క్రమంలోనే రేణూ దేశాయ్ తో విడాకులు తీసుకున్నారు. అనంతరం అన్నా లెజినీవాను వివాహం చేసుకున్నారు. ఇదిలా ఉండగా లెజినీవా ప్రముఖ రష్యన్ మోడల్, నటి కాగా అనేక తెలుగు సినిమాలలో కూడా నటించారు.
అన్నా లెజినీవా1980 సంవత్సరం ఆగస్టు 3న జన్మించారు. ఇక ఎకనామిక్ టైమ్స్ ప్రకారం అన్నా లెజినీవా ఆస్తుల విలువ రూ.1800 కోట్లుగా ఉంది. అంతే కాకుండా అన్నా లెజినీవా క్రిస్టియన్ మతానికి చెందినవారు. మొదటిసారిగా పవన్ కల్యాణ్ అన్నా లెజినీవాలకు 2011లో పరిచయం ఏర్పడింది. తీన్మార్ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరికీ పరిచయం ఏర్పడగా ఒకరితో మరొకరు ప్రేమలో పడ్డారు. తరువాత మూడేళ్ల పాటు వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక 2013లో వీరిద్దరూ పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. వీరికి ఓ కూతురు, కుమారుడు ఉన్నారు. కూతురు పేరు పొలేనా, కుమారుడు మార్క్ శంకర్ లు ఉన్నారు. ఇక గతంలో అన్నా లెజినీవా మోడల్, నటి అయినప్పటికీ ఆమె సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్నారు.
అధికారికంగా ఆమెకు అసలు సోషల్ మీడియా ఖాతాలు కూడా లేకపోవడం విశేషం. మరోవైపు అన్నా లెజినీవా ప్రస్తుతం ఎక్కువగా రష్యాలో ఉంటున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా అన్నా లెజినీవా పిల్లలు ఇద్దరినీ సింగపూర్ లో చదివించాలనే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వినిపించాయి. అయితే దీనిపై సమాచారం లేదు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…