Pawan Kalyan : పవన్ కళ్యాణ్.. చిరంజీవి తమ్ముడుగా పరిశ్రమలోకి వచ్చినా ఒక తరుణంలో పవన్ కళ్యాణ్ అన్నయ్యే చిరంజీవి అనిపించుకున్న స్టార్. భిన్నమైన ఆలోచనా ధోరణి ఉన్న పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎన్నో భారీ విజయాలున్నాయి. అతను సాధించిన విజయాలన్నీ ట్రెండ్ సెట్ చేసినవే. ఈ కారణంగానే అతనికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఒకవైపు నటన చేస్తూనే.. దర్శకుడుగా ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం జనసేన పార్తీ పెట్టి రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నాడు పవన్ కళ్యాణ్. అయితే పవన్ రెమ్యూనరేషన్ గురించి ఎప్పుడు చర్చ నడుస్తూనే ఉంటుంది. రీఎంట్రీ తర్వాత పవన్ వకీల్‌సాబ్ చిత్రానికి 50 కోట్ల పారితోషికం తీసుకున్నట్టు టాలీవుడ్ లో వార్తలు చక్కర్లు కొట్టాయి.
భీమ్లా నాయక్ కి కూడా దాదాపుగా అంతే ఇచ్చారని సమాచారం. ఇక హరిహరవీరమల్లు నెక్ట్స్ చేయబోయే సినిమాలకు ఆయన సుమారుగా రూ. 65కోట్లు ఒక్కో సినిమాకి పారితోషికంగా తీసుకుంటున్నారని ఫిల్మ్ నగర్ టాక్. కానీ అన్నింటిని పటాపంచల్ చేశారు పవన్ కళ్యాణ్. తాను తీసుకునే అసలు పారితోషికం ఎంతో మంగళగిరిలో మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. గత ఎనిమిదేళ్లలో 6 సినిమాలను చేశానని, వీటిన్నంటికి కలిపి తనకు 100 కోట్ల నుంచి 120 కోట్లు పారితోషికంగా వచ్చిందని చెప్పారు. అయితే ఇందులో 33.37కోట్లు టాక్స్ రూపంలోనే కట్టారట. జీఎస్టీ కాకుండా ఈ మొత్తాన్ని తాను ప్రభుత్వానికి చెల్లించినట్టు తెలిపారు పవన్. తన పిల్లల పేర్లపై డిపాజిట్ చేసిన మనీని కూడా వాడుకుని జనసేన ఆఫీస్ కట్టానని, పార్టీకి 5 కోట్ల ఫండ్ ఇచ్చానని, దాదాపు 12కోట్లు విరాళాలే ఇచ్చానని చెప్పారు పవన్.
అందులో 30 లక్షలు అయోధ్యకి కూడా అందించారట. అంటే ఈ లెక్కన ఒక్కో సినిమాకి పవన్ కేవలం 20కోట్లు మాత్రమే తీసుకుంటున్నారని చెప్పొచ్చు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న స్టార్ హీరోలంతా 50 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారు. బయట జరుగుతున్న ప్రచారం కంటే రెండు రెట్లు తక్కువగానే పవన్ రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. ఇదే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. పవన్ నటించే సినిమా గట్టిగా కలెక్ట్ చేస్తే 100 కోట్లు వస్తుంది. అదే సినిమా బ్లాక్ బస్టర్ అయితే ఈజీగా 200 కోట్లు వసూలు చేస్తుంది. అలాంటిది ఆయన కేవలం 20 కోట్లే పారితోషికం తీసుకోవడం అభిమానులను సైతం సర్ప్రైజ్ చేస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…