Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. అయితే ఈయన రీఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుస రిమేక్ చిత్రాలలో నటిస్తూ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే వకీల్ సాబ్, భీమ్లా నాయక్ చిత్రాలలో నటించి మంచి విజయాన్ని అందుకున్నారు. ఇలా ఈ సినిమా విజయవంతం కావడంతో మరో రీమేక్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
తమిళంలో సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన వినోదయ సీతం సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తోపాటు సాయి ధరమ్ తేజ్ నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు గాను ఈ నెల 24వ తేదీ నుంచి షూటింగ్ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలోనే పెద్దఎత్తున సినిమా పనులను వేగవంతం చేస్తున్నారు.
ఇకపోతే ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ 20 రోజుల పాటు తన కాల్షీట్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ 20 రోజులకు పవన్ కళ్యాణ్ తీసుకున్న రెమ్యునరేషన్ తెలిస్తే ప్రతి ఒక్కరూ ఎంతో ఆశ్చర్యపోతున్నారు. పవన్ కళ్యాణ్ కేవలం 20 రోజులకే రూ.60 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఈ లెక్కన చూస్తే రోజుకు మూడు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు లెక్క. ఇక ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ZEE5తో కలిసి ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…