Pawan Kalyan : జనసేన పార్టీతో పవన్ కల్యాణ్ ఓ వైపు ప్రత్యక్ష రాజకీయాల్లో చాలా బిజీగా ఉంటున్నారు. మరోవైపు సినిమాలకు సైతం సమయం కేటాయిస్తున్నారు. ఆయన జనసేన పార్టీతో ఏపీలో అధికారంలోకి రావాలని భావించారు. కానీ వర్కవుట్ కాలేదు. దీంతో అప్పటి నుంచి ప్రతిపక్షం పాత్రనే పోషిస్తున్నారు. అయితే రాజకీయాల్లో క్రియాశీలకంగా మారితే సినిమాలను వదిలేద్దామని పవన్ ఆశించారు. కానీ అలా జరగలేదు. దీంతో ఆయన వకీల్ సాబ్ తో సినిమాల్లోకి మళ్లీ ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆయన ఓ వైపు రాజకీయాలు.. మరోవైపు సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. అయితే ప్రస్తుతం పవన్‌కు చెందిన ఓ ఫొటో వైరల్‌గా మారింది. ఇంతకీ అందులో ప్రత్యేకత ఏముంది ? అన్న విషయాన్ని ఒక్కసారి పరిశీలిస్తే..
పవన్ కల్యాణ్ తాజాగా ఏపీలో కౌలు రైతుల భరోసా యాత్ర చేస్తున్నారు. అందులో భాగంగానే ఏపీలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.1 లక్ష చొప్పున సహాయం చేస్తున్నారు. దీనికి గాను ఆయన జనసేన పార్టీకి భారీగా విరాళం ఇచ్చారు. అయితే ఈ పర్యటనలో పవన్ చేతులెత్తి నమస్కరించినప్పుడు ఆయన ఫొటోను క్లిక్‌మనిపించారు. ఇక ఆ ఫొటోను పరిశీలిస్తే.. ఆయన చేతి వేళ్లకు ఉంగరాలు కనిపించాయి. దీంతో ఇప్పుడీ విషయం హాట్ టాపిక్‌గా మారింది.
పవన్ స్వతహాగా చేగువేరా భావాలు కలిగిన వ్యక్తి. అలాంటిది ఆయన ఇలా ఉంగరాలను ధరించి కనిపించడం అంటే.. ఆయన జ్యోతిష్యాన్ని నమ్ముతున్నారని అర్థం చేసుకోవచ్చు. ఇలా ఆయన సడెన్‌గా రూటు ఎందుకు మార్చారు ? అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. అయితే అలా ఉంగరాలను ధరించాలని ఓ దర్శకుడు చెప్పారట. అందుకనే పవన్ అలా చేస్తున్నారట. దీంతో ఆయన సీఎం కావాలనే కోరిక బలంగా ఉన్నట్లు అర్థమవుతోంది. మరి పవన్ కల నెరవేరుతుందా.. లేదా.. అనేది చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…