Pawan Kalyan BJP : బద్వేల్ ఉప ఉన్నికకు నోటిఫికేషన్ విడుదల అవడం ఏమోగానీ.. ఈ ఉప ఎన్నికతో బీజేపీ పవన్‌ను ఇరుకున పెడుతున్నట్లు తెలుస్తోంది. ఓ వైపు అక్కడ పోటీ చేసేది లేదని, ఏకగ్రీం అయితే బాగుంటుందని.. పవన్ చెప్పేశారు. అయితే గతంలో టీడీపీతో ఉన్న అనుబంధమో, మరో విషయమో తెలియదు కానీ.. పవన్ చెప్పినట్లుగా.. టీడీపీ కూడా అక్కడ పోటీ చేయడం లేదని చెప్పింది. దీంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
అయితే పవన్, బీజేపీ మిత్రులు కనుక.. ఒకరి నిర్ణయాన్ని మరొకరు స్వాగతించాల్సి ఉంటుంది. కానీ పవన్ నిర్ణయానికి మాత్రం బీజేపీ వ్యతిరేకంగా వెళ్తోంది. పవన్ వద్దు అంటుంటే.. బీజేపీ మాత్రం పోటీ చేయాల్సిందేనని పట్టుబట్టింది. మరోవైపు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఒక అడుగు ముందుకు వేసి బద్వేల్‌లో పోటీ చేస్తామని, విడిచిపెట్టే ప్రసక్తి లేదని కుండబద్దలు కొట్టేశారు. అలాగే తమ ప్రచారానికి పవన్ కూడా వస్తారని స్పష్టం చేశారు. దీంతో బీజేపీ పవన్‌ను ఇరుకున పెట్టినట్లు అయింది.
అయితే బద్వేల్‌లో పోటీ చేయొద్దన్న పవన్ తన నిర్ణయాన్ని తానే వ్యతిరేకించి బీజేపీతో ఎన్నికల్లో ప్రచారం చేస్తారా ? లేదా ? అన్నది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే.. రాజకీయాల్లో ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటేనే ప్రజల నుంచి ఆమోదం లభిస్తుంది. అలా కాకుండా తన నిర్ణయానికి తానే వ్యతిరేకంగా వెళితే.. ప్రజామోదం లభించదు. ఈ క్రమంలో పవన్ వద్దంటుండడం, బీజేపీ పోటీ చేస్తామని అంటుండడం.. చర్చనీయాంశంగా మారాయి.
బద్వేల్ లో పోటీ చేయాలన్న బీజేపీ నిర్ణయాన్ని సమర్థించి పవన్ తన నిర్ణయాన్ని తానే వ్యతిరేకించి ముందుకు సాగుతారా ? లేక తన నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటారా ? అని.. రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. అయితే పవన్ తీసుకునే నిర్ణయంపైనే ఆ పార్టీ రాజకీయ భవిష్యత్తు ఉంటుందని చర్చించుకుంటున్నారు. ఎందుకంటే బీజేపీ చెప్పినట్లు చేయకపోతే జనసేనకు భవిష్యత్తులో మద్దతు ఇచ్చే అవకాశాలు సన్నగిల్లుతాయి. మరి పవన్ ఈ విషయంలో ఏం చేస్తారో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…