Chiranjeevi : సినిమా ఇండస్ట్రీలో మెగా బ్రదర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిరంజీవి అండదండలతో ఆయన పేరు, పలుకుబడితో ఇండస్ట్రీలో తమకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు నాగబాబు, పవన్ కళ్యాణ్. చిరంజీవి అనే మహావృక్షం నీడలోనే పెరిగి పెద్దయిన వీరికి నేడు చిరంజీవి పరాయి వాడిగా మారిపోయారా..? అనే సందేహం ప్రస్తుతం అందరిలోనూ కలుగుతోంది.
తాజాగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్, నాగబాబు పార్టీ కార్యక్రమాలలో పాల్గొని ఒకరిపై మరొకరు ప్రశంసలు కురిపించుకున్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తాను రాజకీయాల్లోకి రావడానికి కారణం నాగబాబు ఇచ్చిన ఓ పుస్తకమే అని చెప్పడం అందరినీ కాస్త అసహనానికి గురిచేస్తోంది. తమ విజయానికి ఎంతో కారణమైన చిరంజీవిని పేరుకైనా చెప్పకపోవడంతో ఎంతోమంది మెగా బ్రదర్స్‌పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా పవన్ కళ్యాణ్, నాగబాబులు చిరంజీవిని పక్కన పెట్టడానికి కారణం.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో చిరంజీవి సన్నిహితంగా మెలగడమే.. అనే సందేహాలు వస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చిరంజీవి పార్టీలకు అతీతంగా సతీ సమేతంగా వెళ్లి ముఖ్యమంత్రి జగన్ ను కలిశారు. ఆ తరువాత సినీ పరిశ్రమ సమస్యల గురించి పలు సార్లు ముఖ్యమంత్రిని కలవడం, ఆయనతో సన్నిహితంగా ఉండటం పవన్ కళ్యాణ్ కు నచ్చలేదు. సినీ పరిశ్రమలో ఏర్పడిన సమస్యలను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయాలని భావించిన జనసేన పార్టీకి మెగాస్టార్ ఆ అవకాశం ఇవ్వలేదు.
పలుసార్లు ముఖ్యమంత్రి జగన్ ని కలిసి సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాన్ని చూపించారు. ఇలా సినీ పరిశ్రమకు జగన్ అండదండలు ఉండటంతో చిరంజీవి ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ పలుసార్లు ట్వీట్స్ చేశారు. అయితే చిరంజీవి జగన్ తో సన్నిహితంగా ఉండడం మెగా బ్రదర్స్ కి నచ్చలేదు. అందుకే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున చిరంజీవి హాజరు కాకపోవడం, చిరంజీవి గురించి ఒక్కమాట కూడా మాట్లాడకపోవడం.. జనసేన అభిమానులను కూడా విస్మయానికి గురిచేస్తోంది. ఈ క్రమంలోనే తమ రాజకీయాల కోసం తమకు నీడను ఇచ్చి ప్రయోజకులను చేసిన సొంత అన్ననే మెగా బ్రదర్స్ దూరం పెట్టేశారా ? అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక దీనికి కాలమే సమాధానం చెప్పాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…