Pavithra Lokesh : నటి పవిత్రా లోకేష్, సీనియర్ నటుడు నరేష్‌ల మధ్య ఏదో సంబంధం ఉందని గత కొంత కాలంగా వార్తలు వస్తున్న విషయం విదితమే. వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. అయితే పెళ్లి అనేది ఫూల్స్ చేసే పని అని.. తనకు వివాహ వ్యవస్థపై నమ్మకం పోయిందని నరేష్ అన్నారు. కానీ పవిత్ర లోకేష్‌తో ఉన్న రిలేషన్ షిప్‌పై ఆయన క్లారిటీ ఇవ్వలేదు. వీరు ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్తుండడం, మహాబలేశ్వరం టెంపుల్‌లో కలసి పూజలు చేయడం.. వంటి సంఘటనల వల్ల వీరు సహజీవనం చేస్తున్నారని అనుకున్నారు. అయితే ఈ విషయాలన్నింటినీ పవిత్రా లోకేష్ బయట పెట్టారు. ఓ టీవీ చానల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో ఆమె అడ్డంగా దొరికిపోయారు.
కర్ణాటకకు చెందిన ఓ కన్నడ న్యూస్ చానల్ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించింది. ఆ చానల్‌కు చెందిన ఓ ప్రతినిధి తనను తాను ఓ కన్సల్టెంట్‌గా చెప్పుకుని స్టింగ్ ఆపరేషన్ చేశాడు. ఈ క్రమంలోనే ఆ ప్రతినిధి ఆమెను పలు ప్రశ్నలు అడిగాడు. నరేష్‌తో ఉన్న సంబంధం గురించి కూడా ఆమెను ప్రశ్నలు అడిగాడు. అయితే తమ మధ్య రిలేషన్ షిప్ ఉన్న మాట నిజమేనని ఆమె అంగీకరించింది. అయితే అది తన వ్యక్తిగత విషయమని.. దానిపై ప్రశ్నించేందుకు ఎవరికీ అధికారం లేదని తెలిపింది.
ఇక తాను, నరేష్ కలసి ఉంటున్నట్లు సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీకి తెలుసని.. వారికే అభ్యంతరం లేనప్పుడు మిగిలిన వారికి అభ్యంతరాలు ఎందుకని ఆమె ప్రశ్నించింది. ఈ క్రమంలోనే ఆమె స్టింగ్ ఆపరేషన్ తాలూకు వీడియో దుమారం రేపుతోంది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి కేసు విషయంలో ఆ చానల్ వారు నిజానిజాలు తెలుసుకునేందుకు ఈ స్టింగ్ ఆపరేషన్ చేసినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఈ సంఘటన వల్ల వీరి కథ ఊహించని మలుపు తిరిగిందని చెప్పవచ్చు. దీనిపై నరేష్ లేదా పవిత్ర లోకేష్ మళ్లీ క్లారిటీ ఇస్తారో.. లేదో.. చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…