Paruchuri Gopala Krishna : మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ నటించిన ఆచార్య చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంతటి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుందో అందరికీ తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి సినిమా కెరీర్‌లోనే అత్యంత దారుణమైన డిజాస్టర్‌గా ఈ మూవీ నిలిచింది. ఈ సినిమా వల్ల మేకర్స్‌కు ఏకంగా రూ.84 కోట్ల నష్టం వచ్చింది. దీంతో చిరంజీవి, రామ్ చరణ్, కొరటాల శివ ఆ నష్టాన్ని భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆచార్య సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది అనే విషయంపై ఇప్పటి వరకు అనేక మంది అనేక కారణాలు చెప్పారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఇదే విషయంపై స్పందించారు. ఆయన ఆచార్య ఫ్లాప్‌పై పలు కామెంట్స్ చేశారు.
ప్రస్తుత తరుణంలో నక్సలిజం, కమ్యూనిజం, అభ్యుదయ భావాలు.. వంటి మెసేజ్‌లతో కూడిన సినిమాలు ప్రేక్షకులకు ఎక్కడం లేదని.. ఏమైనా వారు వినోదాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. అలాంటప్పుడు కొరటాల ఎంచుకున్న కథనే తప్పని అన్నారు. ఆచార్య టైటిల్ అసలు సెట్ కాలేదని అన్నారు. చిరంజీవి, చరణ్ ఇందులో బాగానే యాక్ట్ చేసినప్పటికీ కథ చాలా బలహీనంగా ఉందని.. అలాంటప్పుడు హీరో ఎవరు ఉన్నా సినిమా ఆడదని అన్నారు. ఇక అసలు ఈ మూవీలో చరణ్ లేకుండా ఉంటే బాగుండేదని అన్నారు.
సస్పెన్స్, సెంటిమెంట్ ఒకే ఒరలో ఇమడలేవని పరుచూరి గోపాల కృష్ణ అన్నారు. ఈ విషయాన్ని కొరటాల గుర్తు పెట్టుకుంటే మంచిదని ఆయనకు క్లాస్ పీకారు. ఇక చరణ్ పాత్రను సెకండాఫ్ వరకు సీక్రెట్‌గా ఉంచారని.. అలాగే ముగింపు కూడా సరిగ్గా లేదని.. ఫస్టాఫ్‌లోనే చరణ్‌ను చూపించి ఉంటే బాగుండేదని అన్నారు. ఇలా ఆచార్య మూవీలో ఉన్న తప్పుల గురించి పరుచూరి గోపాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడు ఎవరెన్ని అన్నా.. సినిమా మాత్రం దారుణ డిజాస్టర్ టాక్‌ను తెచ్చుకుంది కనుక ఇప్పుడు ఎవరూ ఏమీ చేయలేరు. ఇకపైనైనా ఇలాంటి కథలతో ప్రయోగాలు చేయకుండా ఉంటే మంచిదని.. చిరు ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…