Oppo : మొబైల్స్ తయారీ సంస్థ ఒప్పో.. ఎఫ్21 ప్రొ, ఎఫ్21 ప్రొ 5జి పేరిట రెండు నూతన స్మార్ట్ ఫోన్‌లను భారత్‌లో విడుదల చేసింది. వీటిల్లో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. వీటి ధరలు కూడా తక్కువగానే ఉండడం విశేషం. మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో ఈ రెండు ఫోన్లు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఇక వీటిలో అందిస్తున్న ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి.
ఒప్పో ఎఫ్ 21 ప్రొ స్మార్ట్ ఫోన్‌లో.. 6.43 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌ను అందిస్తున్నారు. ఈ డిస్‌ప్లే 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. కనుక దృశ్యాలు నాణ్యంగా కనిపిస్తాయి. ఈ ఫోన్‌లో ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్‌లో ఈ ఫోన్ విడుదలైంది.
ఒప్పో ఎఫ్ 21 ప్రొ ఫోన్‌లో.. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ లభిస్తుంది. డ్యుయల్ సిమ్‌లను వేసుకోవచ్చు. వెనుక వైపు 64 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాకు తోడుగా మరో 2 మెగాపిక్సల్ మైక్రో స్కోపిక్ కెమెరా, ఇంకో 2 మెగాపిక్సల్ మాక్రో కెమెరాలను ఏర్పాటు చేశారు. ముందు వైపు 32 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందిస్తున్నారు. డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ వంటి ఇతర ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి.
ఇక ఒప్పో ఎఫ్ 21ప్రొ 5జి స్మార్ట్ ఫోన్‌లో.. 6.43 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌లో ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్‌లో ఈ ఫోన్ విడుదలైంది. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ లభిస్తుంది. డ్యుయల్ సిమ్‌లను వేసుకోవచ్చు. వెనుక వైపు 64 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాకు తోడుగా మరో 2 మెగాపిక్సల్ మోనో క్రోమ్ కెమెరా, ఇంకో 2 మెగాపిక్సల్ మాక్రో కెమెరాలను ఏర్పాటు చేశారు. ముందు వైపు 16 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందిస్తున్నారు. 5జి, డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.1, యూఎస్‌బీ టైప్ సి, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ వంటి ఇతర ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి.
ఇక ఒప్పో ఎఫ్ 21 ప్రొ ఫోన్ ధర రూ.22,999 ఉండగా.. దీన్ని ఏప్రిల్ 15వ తేదీ నుంచి విక్రయించనున్నారు. అలాగే ఒప్పో ఎఫ్ 21 ప్రొ 5జి ఫోన్ ధర రూ.26,999గా ఉంది. దీన్ని ఏప్రిల్ 21వ తేదీ నుంచి విక్రయిస్తారు. ఇక లాంచింగ్ సందర్భంగా ఈ ఫోన్‌లపై ఆఫర్లను అందివ్వనున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, కోటక్, స్టాండర్డ్ చార్టర్డ్, ఐడీఎఫ్‌సీ, బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డులతో ఈ ఫోన్‌లపై 10 శాతం క్యాష్ బ్యాక్‌ను పొందవచ్చు. అలాగే నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం లభిస్తోంది.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…