Offbeat : రహదారులపై మనం ప్రయాణించేటప్పుడు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. వాటి పక్కన ఉండే చెట్లను చూస్తుంటే మనస్సుకు ఎంతో ఆహ్లాదం కలుగుతుంది. అందుకనే చాలా మంది ప్రయాణాలను చేయడాన్ని ఇష్టపడుతుంటారు. అయితే రహదారుల పక్కన ఉండే చెట్లకు చాలా చోట్ల కింది భాగంలో తెలుపు.. దాని మీద పైభాగంలో కొద్దిగా ఎరుపు రంగు పెయింట్లను వేస్తారు. చూశారు కదా. ఇలా ఎందుకు వేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
చెట్లకు ఇలా తెలుపు, ఎరుపు రంగు పెయింట్లను వేశారంటే.. అవి అటవీ శాఖ పరిధిలోకి వస్తాయని అర్థం. అంటే వాటిని ఆ శాఖ అధికారులు ప్రత్యేకంగా రక్షిస్తారన్నమాట. అలాంటి చెట్లను చిన్న కొమ్మ నరికినా వారు చట్ట పరంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటారు. అందుకనే అలా చెట్లకు పెయింట్లను వేస్తారు. ఇక తెలుపు రంగు పెయింటే ఎందుకంటే.. రాత్రి పూట కూడా చెట్లు సులభంగా కనిపించాలని చెప్పి అలా తెలుపు రంగు పెయింట్‌ను కింది భాగంలో వేస్తారు.
ఇక చెట్టు కింది భాగం నుంచి పైన కొంత భాగం వరకు మాత్రమే ఎందుకు పెయింట్లను వేస్తారు అంటే.. భూమిలోంచి కీటకాలు, పురుగులు చెట్టు ఎక్కి పాడు చేయకుండా ఉంటాయని చెట్టు కింది భాగం నుంచి మొదలుపెట్టి పైన కొంత వరకు పెయింట్ వేసి వదిలేస్తారు. ఇలా పెయింట్ వేయడం వల్ల కీటకాలు, పురుగుల బారిన పడకుండా చెట్లు సురక్షితంగా ఉంటాయి.
ఇక చెట్లకు ఇలా పెయింట్ వల్ల వాటి ఆయుర్దాయం పెరుగుతుందట. త్వరగా దెబ్బతినకుండా ఉంటాయి. అందుకనే వాటికి ఇలా పెయింట్స్ వేస్తుంటారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…