NTR : యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అటు వెండితెరపై, ఇటు బుల్లితెరపై తన హవా కొనసాగిస్తున్నారు. ప్రేక్షకులకు కూడా ఎన్టీఆర్ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది. ప్రముఖ ఛానల్ లో ఎవరు మీలో కోటీశ్వరులు అనే ప్రోగ్రామ్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ షోలో ప్రేక్షకుల నుండే కాకుండా ఎన్టీఆర్ తన లైఫ్ లో జరిగిన మూమెంట్స్ ని కూడా అప్పుడప్పుడూ షేర్ చేసుకుంటూ ఉంటారు.
రీసెంట్ గా ఈ షో లో ఒక క్వశ్చన్ కి సమాధానంగా నరసింహనాయుడు సినిమా గురించి ఇంట్రెస్టెంగ్ విశేషాలు షేర్ చేసుకున్నారు. నరసింహనాయుడు సినిమాకు బి. గోపాల్ డైరెక్షన్ చేశారు. మణిశర్మ మ్యూజిక్ అందించారని ఎన్టీఆర్ అన్నారు. తన లైఫ్ లో ఎప్పటికీ మర్చిపోలేని సినిమా నరసింహనాయుడు అని తెలిపారు. ఈ సినిమాను తాను ఊర్వశి థియేటర్ లో చూశానని అన్నారు.
ఈ సినిమా చూస్తున్నప్పుడు ముందున్న సీట్ ని గట్టిగా తంతే ఈ సీట్ విరిగిపోయిందట. అలాగే ఎన్టీఆర్ కూచిపూడి డాన్సర్ అని, తన గురువు సుధాకర్ అని అన్నారు. ప్రజంట్ ఆయన ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యారని.. ప్రజంట్ ఆయన్ను కలవడానికి వీలు లేదని అన్నారు. అలాగే ఎన్టీఆర్ తనకు కూచిపూడి డాన్స్ ని నేర్పించిన గురువు సుధాకర్ కి నమస్కారాలు చేసి థ్యాంక్స్ చెప్పారు.
తాను ఏం చదువుకున్నా.. తనకు నటన మాత్రమే తెలుసని అన్నారు. ఆయనకు తాత, నాన్న స్పూర్తితో నటుడు కావాలనే ఆసక్తి పెరిగిందని ఎన్నో విషయాల్ని షేర్ చేసుకున్నారు. అలాగే ఆ నటన కోసం తాను చావడానికైనా సిద్ధం అని అనడం షాకింగ్ గా నిలిచింది.
ఇక ఈ ప్రోగ్రామ్ లో ఎన్టీఆర్ ప్రతి ఒక్క వ్యక్తినీ ఎంతో ఆత్మీయతగా పలకరిస్తూ.. తన ఫ్యామిలీ మెంబర్ లా ట్రీట్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ లో ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న తీరు ఎంతోమందిని ఆకట్టుకుంటోంది. ప్రజంట్ ఈయన ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో ఆర్ఆర్ఆర్ అనే మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా జనవరి 7న రిలీజ్ కు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. నెక్ట్స్ కొరటాల శివ డైరెక్షన్ లో ఎన్టీఆర్ మరో మూవీ చేయనున్నట్లు తెలుస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…