NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నాడు. ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని పూర్తి చేసిన ఎన్టీఆర్ ప్రస్తుతం ఎవరు మీలో కోటీశ్వరులు షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. మరి కొద్ది రోజులలో దీనికి ప్యాకప్ చెప్పనున్నాడు. అనంతరం కొరటాల శివతో కలిసి సినిమా చేయనున్నాడు. డిసెంబర్‌లో కొరటాల శివ చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు తారక్ ప్లాన్ చేస్తున్నాడని సమాచారం.
కొరటాల శివ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ చిత్రాన్ని కూడా ప్రారంభిస్తాడట ఎన్టీఆర్. అనంతరం బుచ్చిబాబుతో పాటు పలువురు దర్శకులు ఎన్టీఆర్‌తో సినిమా చేసేందుకు సిద్దంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇటీవల బీ-టౌన్ బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ ఓ సినిమా చేయబోతున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది.
సంజయ్ లీలా భన్సాలీ.. ఎన్టీఆర్ కోసం పౌరాణిక అంశాలతో కూడిన పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్ స్క్రిప్ట్‌ను సిద్దం చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌పై ఎన్టీఆర్ కూడా ఆసక్తిగా ఉన్నట్లు సినీ వర్గాల నుంచి సమాచారం. అంతేగాక దీనికి ‘జై బావ్ రే’ అనే టైటిల్‌ను కూడా పరిశీలిస్తున్నారట.
అన్నీ కుదిరితే ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుందని అంటున్నారు. చూడాలి దీనిపై ఎప్పుడు క్లారిటీ వస్తుందో..! మరోవైపు ఎన్టీఆర్, రామ్ చరణ్ ల మల్టీస్టారర్ ఆర్ ఆర్ ఆర్ విడుదలకు సిద్ధమైంది. సంక్రాంతి కానుకగా జనవరి RRR movie విడుదల కానుంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను రాజమౌళి దుబాయ్ లో ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ మూవీపై అంచనాలు భారీ ఎత్తున నెలకొన్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…