NTR : దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఇందులో కొమురం భీమ్‌గా ఎన్‌టీఆర్ యాక్టింగ్ అదరగొట్టేశాడు. అలాగే అల్లూరి పాత్రలో రామ్ చరణ్ అద్భుతంగా నటించి ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శింపబడుతూ రికార్డులను కొల్లగొడుతోంది. ఇక త్వరలోనే ఈ మూవీని చైనా, జపాన్‌లలోనూ విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ తరువాత చరణ్, ఎన్‌టీఆర్‌లు తమ ప్రాజెక్టుల్లో బిజీగా మారిపోయారు.
రామ్‌చరణ్ నటించిన ఆచార్య సినిమా ఈ నెల 29వ తేదీన విడుదల కానుండగా.. శంకర్ దర్శకత్వంలో చరణ్ ఇంకో సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు. ఇక ఎన్‌టీఆర్ కూడా కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. ఇందులో హీరోయిన్‌గా ఆలియాభట్‌ను కన్‌ఫామ్ చేశారు. కానీ ఆమెకు ప్రస్తుతం వివాహం అయినందున ఆమె కాల్ షీట్స్ అందుబాటులో లేవు. దీంతో ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుంది. దీనిపై చిత్ర యూనిట్ తాజాగా ప్రకటన చేసింది. ఆలియా నటించడం లేదని చెప్పారు. అయితే కొరటాల శివతో చేయనున్న మూవీకి గాను ఎన్‌టీఆర్ భారీ ఎత్తున పారితోషికం తీసుకోబోతున్నాడని తెలుస్తోంది.
ఆర్ఆర్ఆర్ సినిమాకు డీవీవీ దానయ్య నిర్మాత కాగా.. ఆ మూవీకి తారక్ రూ.45 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడట. ఇక కొరటాల శివతో చేయనున్న సినిమాకు ఎన్‌టీఆర్ ఏకంగా రూ.10 కోట్లు పెంచి రూ.55 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ ఎఫెక్ట్ వల్లే ఎన్‌టీఆర్ తన పారితోషికాన్ని అమాంతం పెంచేశారని సమాచారం. ఇక త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ను జరుపుకోనుంది. ఆలియా తప్పుకోవడంతో ఇంకో హీరోయిన్ కోసం ప్రస్తుతం చిత్ర యూనిట్ వేట కొనసాగిస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…