Bobbili Puli : రూ.50 ల‌క్ష‌లు పెట్టి తీసిన బొబ్బిలిపులి.. ఎంత వ‌సూలు చేసిందో తెలుసా..?

Bobbili Puli : విశ్వ విఖ్యాత న‌ట‌సార్వ‌భౌమ నంద‌మూరి తార‌క‌రామ‌రావు నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎలాంటి పాత్రలోనైనా అవలీలగా నటించగలరు ఎన్టీఆర్. పౌరాణిక‌, జాన‌ప‌ద‌, సాంఘిక చిత్రాల్లో అద్భుత‌మైన పాత్ర‌ల్లో న‌టించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఘ‌న‌త మొదటిగా ఎన్టీఆర్‌కే ద‌క్కుతుంది. ఎన్టీఆర్ నట జీవితంలో ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలు ఉన్నాయి. ఆయన నటించిన  హిట్ చిత్రాల్లో బొబ్బిలి పులి సినిమా కూడా ఒకటి. దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం అప్పట్లో సంచలనంగా నిలిచింది.

ద‌ర్శ‌కుడు దాస‌రి నారాయ‌ణ సంభాష‌ణ‌లు రాస్తున్న స‌మ‌యంలో నిర్మాత వ‌డ్డే ర‌మేష్ ఈ సినిమాకు అన్ని చిత్రాల‌కంటే  క్లైమాక్స్ భిన్నంగా, చ‌రిత్ర‌లో అది మ‌రిచిపోలేని స‌న్నివేశం కావాల‌ని దాస‌రికి చెప్పార‌ట‌. అనుకున్నవిధంగానే దాస‌రి అలాగే సినిమాను తీర్చిదిద్దార‌ట‌. ఫైనల్ గా సినిమాలో ఎన్టీఆర్ డైలాగ్స్ చాలా అద్భుతంగా వ‌చ్చాయి.

Bobbili Puli

ఇక ఈ సినిమా గురించి చర్చలు జరుగుతున్న సమయానికి అప్ప‌టికే ఎన్టీఆర్ పార్టీ స్థాపించాల‌నే ఆలోచనతో బిజీగా ఉన్నారు. ఆ స‌మ‌యంలోనే దాస‌రిని పిలిపించి ఒక మంచి సినిమా చేద్దామ‌ని చెప్పారట ఎన్టీఆర్‌. దాస‌రి బాగా ఆలోచించి ఒక సైనికుడు సెల‌వుల‌కు ఇంటికి వ‌స్తాడని.. అక్క‌డి వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌ను ప‌రిశీలిస్తాడు. అక్క‌డి ప‌రిస్థితుల‌ను చూసి నేను ఉండాల్సింది సైన్యంలో కాదు. ఇక్క‌డే ఉండి సమాజంలో జరుగుతున్న అన్యాయంపై తిర‌గ‌బ‌డ‌తాడు అని క‌థ చెప్పాడు. క‌థ‌ చాలా బాగుంది బ్ర‌ద‌ర్ ప్రొసీడ్ అని ఎన్టీఆర్ దాస‌రితో చెప్పారట‌.

ఇలాంటి క‌థ‌లో ఆడ‌వారికి కూడా న‌చ్చే పాయింట్లు ఉండాలి. ప్రియుని బాగు కోసం త‌న ప్రేమ‌ను త్యాగం చేసే ప్రియురాలు, భ‌ర్త బ‌తికే ఉన్నా చ‌నిపోయాడ‌నుకొని బొట్టు తీసేసిన భార్య, భార్య చనిపోయిందని తెలుసుకున్న భర్త పోలీసులు కాపు కాసి ఉన్నా కూడా కాటికాప‌రి వేషంలో వ‌చ్చి త‌ల‌కొరివి పెడ‌తారు.. ఇక చాలు అనుకున్నారు దాస‌రి నారాయ‌ణ‌రావు. ఇక చిత్రం మొత్తానికి క్లైమాక్స్ లో జరిగే సంభాషణ హైలైట్ గా నిలుస్తుంది.

రూ.50 లక్షల బడ్జెట్ తో 50 రోజులలో నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ దగ్గరికి వెళ్ళింది. సెన్సార్ బోర్డు చైర్మ‌న్ యల్.వి.ప్ర‌సాద్‌, ఎదురుగా ద‌ర్శ‌కుడు దాస‌రినారాయ‌ణ‌రావు, నిర్మాత వడ్డే రమేష్ కూర్చుని సినిమా చూశారు. దానికి ముందే మ‌ద్రాస్ రీజ‌న‌ల్ క‌మిటీ బొబ్బిలి పులి సినిమాను చూసింది. 3వేల అడుగుల క‌ట్స్ చెప్పింది. 3వేల అడుగుల‌ క‌ట్స్ అంటే ఇక సినిమాలో ఏమీ మిగ‌ల‌దు. ఎన్టీఆర్ చెప్పే డైలాగ్‌లు కూడా మిగ‌ల‌వు. సెంట్ర‌ల్ గవర్నమెంట్ లో ఇందిరాగాంధీ ప్ర‌భుత్వం పాలనలో ఉంది. ఈ డైలాగ్‌లు అన్నీ ఆమె పాల‌న‌కు చిచ్చుపెట్టేలా ఉన్నాయి. ఇందులో డైలాగ్స్ ప్రభుత్వాన్ని తప్పు పట్టేలా ఉన్నాయి.

ఇవ‌న్నీ తీసేయాల‌ని మ‌ద్రాస్ రీజ‌న‌ల్ క‌మిటీ దర్శక నిర్మాతలకు సూచించింది. అసలు విషయం తేల్చుకుందామ‌ని ద‌ర్శ‌కుడు దాస‌రి, నిర్మాత వ‌డ్డే ర‌మేష్‌ రివైజింగ్ క‌మిటీ వ‌ద్ద‌కు వ‌చ్చారు. సెన్సార్ బోర్డు చైర్మ‌న్ యల్.వి.ప్ర‌సాద్ సినిమా చూసి వాళ్ల‌ను పిలిచారు. ఓన్లీ సింగిల్ క‌ట్ ఇస్తున్నాను, క్లైమాక్స్ మొత్తం తీసేయండి అని చెప్పారు. దీంతో దాస‌రి మేము ఢిల్లీలో తేల్చుకుంటామ‌ని తెలియజేశారు.

తొలుత తెలుగు, త‌మిళ ఐఏఎస్‌ల‌ను 18 మంది పోగు చేసుకొని వారందరికీ సినిమా చూపించారు. సినిమా చాలా బాగుంది. ఇలాంటి అద్భుతమైన సినిమాకి క‌ట్స్ ఎందుకు అని అన్నారు అంద‌రూ. ఆ త‌రువాత పీవీ న‌ర‌సింహారావు, పి.వెంక‌ట సుబ్బయ్య‌, జ‌న‌ర‌ల్ కృష్ణారావు, అప్ప‌టి డిప్యూటీ సీఎం జ‌గ‌న్నాథ‌రావు.. వీరంద‌రినీ జ‌త చేసి మ‌ళ్లీ షో వేశాడు నిర్మాత రమేష్. మీకెందుకు మేము చూసుకుంటామ‌ని నిర్మాత ర‌మేష్‌కి అందరూ హామీ ఇచ్చారు. ర‌మేష్‌, ప్ర‌భాక‌ర్‌రెడ్డిలు క‌లిసి మ‌ద్రాస్‌లో ఉన్న దాస‌రికి ఫోన్‌చేశారు. మీరు వెంట‌నే రండి.. ఇంకొక్క‌రికి చూపిస్తే మ‌న సినిమా విడుద‌ల‌వుతుంది. ఆయ‌న ఎవ్వ‌రో కాదు మ‌న తెలుగువాడు నీలం సంజీవ‌రెడ్డి. ఆయ‌న ఆ సమయంలో భార‌త రాష్ట్రప‌తిగా ఉన్నారు.

నీలం సంజీవ‌రెడ్డికి ప్ర‌త్యేకంగా రాష్ట్రప‌తి భ‌వ‌న్ లో బొబ్బిలి పులి చిత్రాన్ని చూపించారు. ఇక సెన్సార్ అధికారులు కటింగ్స్ లేకుండా జులై 9, 1982న సినిమా విడుద‌లైంది. అనేక చోట్ల చిత్రం రిలీజ్ అయ్యి 175 రోజుల‌ వరకు ఆడింది. బొబ్బిలిపులి ఎన్టీఆర్ ని హీరో నుంచి నాయ‌కుడిగా ఆయన రేంజ్ ని పెంచేసింది. ఈ సినిమా అప్పట్లో తెలుగు ఇండస్ట్రీలో మొదటిసారిగా వందకు పైగా థియేటర్లలో విడుదలైన చిత్రంగా రికార్డుల‌ను క్రియేట్ చేసింది.

విడుదలైన తొలిరోజే రూ.13 ల‌క్ష‌లు వ‌సూలు రాబట్టుకుంది. అదేవిధంగా తొలి వారంలో రూ.78 ల‌క్ష‌ల‌కు పైగా కలెక్షన్లను వసూలు చేసింది.  రెండు వారాల్లో కోటికి పైగా వ‌సూలు చేసింది. మొత్తంగా రూ.3 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసిన బొబ్బిలి పులి 39 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఈ చిత్రం హైద‌రాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌ సుద‌ర్శ‌న్ 35 ఎంఎంలో 175 రోజులు రన్ అయ్యి రికార్డులు సృష్టించింది.

Share
Mounika

Recent Posts

ఈ ఫుడ్ తింటే ఊపిరితిత్తులు నెల రోజుల్లో పూర్తి ఆరోగ్యంగా మారుతాయి..!

మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్య‌మైన‌వో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…

Monday, 23 September 2024, 5:22 PM

రోడ్డుపై కుక్క‌లు మిమ్మ‌ల్ని వెంబ‌డిస్తే ఆ స‌మ‌యంలో ఏం చేయాలి అంటే..?

ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మ‌రింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…

Saturday, 21 September 2024, 3:01 PM

క‌లెక్ష‌న్ల‌లో దుమ్ము రేపుతున్న స్త్రీ 2 మూవీ.. బాలీవుడ్ లో ఆల్‌టైమ్ హై రికార్డు..!

సాహో చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న కథానాయిక‌గా న‌టించి అల‌రించిన శ్ర‌ద్ధా క‌పూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో ప‌ల‌క‌రించింది. 2018లో…

Saturday, 21 September 2024, 5:47 AM

జానీ మాస్ట‌ర్ కేసులో అస‌లు ఏం జ‌రుగుతోంది..?

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో ప‌డ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మ‌హిళా…

Friday, 20 September 2024, 9:27 PM

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM