Tollywood : లేడీ సూపర్ స్టార్‌గా పేరుగాంచిన నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె మళయాళీ అయినప్పటికీ తమిళం, తెలుగు సినిమాల్లోనూ నటించింది. అయితే ఈమెకు తెలుగు సినిమాల ద్వారానే మంచి గుర్తింపు లభించింది. దీంతో ఈమెకు ఆఫర్లు వెల్లువలా వచ్చాయి. తరువాత తమిళ సినిమా ఇండస్ట్రీకి మారిపోయింది. తెలుగులో పెద్దగా మూవీలు చేయడం లేదు. కానీ టాలీవుడ్ ద్వారానే నయనతార మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ఆమె నటించిన దుబాయ్ శ్రీను, ప్రభాస్ యోగి.. ఇతర చిత్రాలు ఆమెకు మంచి పేరును తెచ్చి పెట్టాయి. అయితే తన పెళ్లికి ఒక్క తెలుగు యాక్టర్‌ను కూడా ఆమె పిలవలేదట. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ వార్త చర్చనీయాంశంగా మారింది.
నయనతార, విగ్నేష్ శివన్‌ల వివాహం మహాబలిపురంలో గురువారం గ్రాండ్ షెరటాన్ హోటల్‌లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఈ దంపతులు తమిళనాడులోని పలు ఆలయాలతోపాటు ఇతర ప్రదేశాల్లో మొత్తం 1 లక్ష మందికి అన్నదానం చేశారు. వీరి వివాహానికి రజనీకాంత్, షారూఖ్ ఖాన్ వంటి స్టార్స్ హాజరయ్యారు. అయితే ఈమె పెళ్లికి టాలీవుడ్ నుంచి ఒక్కరు కూడా హాజరు కాకపోవడం విస్మయానికి గురి చేసింది. అయితే ఈమె ఒక్క తెలుగు యాక్టర్‌ను కూడా తన పెళ్లికి పిలవలేదట. అందుకనే తెలుగు యాక్టర్లు అసలు ఈమె పెళ్లిలో కనిపించలేదట. మరి ఈమె ఎందుకిలా చేసిందని గుసగుసలాడుకుంటున్నారు.
సాధారణంగా కోలీవుడ్ లేదా బాలీవుడ్‌లలో ఎక్కడ ఏదైనా శుభకార్యం లేదా ముఖ్యమైన వేడుక జరిగితే టాలీవుడ్ కు చెందిన పలువురికి ఆహ్వానాలు అందుతాయి. కానీ నయనతార మాత్రం తెలుగును పూర్తిగా విస్మరించినట్లు తెలుస్తోంది. కనీసం అగ్ర హీరోలకు అయినా సరే ఈమె ఆహ్వానాలు పంపలేదట. దీంతో ఆయా హీరోలకు చెందిన ఫ్యాన్స్ నయన్‌పై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈమె కనీసం టాలీవుడ్‌ను పట్టించుకోలేదని అంటున్నారు. అయితే దీని వెనుక కారణం ఏమున్నప్పటికీ ఈ విషయం మాత్రం హాట్ టాపిక్ అవుతోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…