అలా మొదలైంది చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది నిత్యామీనన్. క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. తన క్యారెక్టర్ కు గుర్తింపు ఉండే చిత్రాలను ఎంచుకుంటూ నిత్యామీనన్ నటనపరంగా మంచి పేరును సంపాదించుకుంది. ఇటీవల కాలంలో నిత్యామీనన్ కు సినిమా ఆఫర్లు తగ్గాయనే చెప్పవచ్చు. తాజాగా నిత్యా మీనన్ నిర్మాతగా బాధ్యతలను చేపట్టారు. ఈ ఆగస్టు 18న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది తిరుచిత్రాంబలం మూవీ.
ఈ చిత్రంలో హీరో ధనుష్ కి జంటగా నిత్యామీనన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ విషయాలన్నీ ఇలా ఉండగా, ఓ సందర్భంలో తను కూడా వేధింపులకు గురయ్యాను అని తెలియజేసి అందరినీ షాక్‌కు గురిచేశారు. సినీ ఇండస్ట్రీ అనేది ఒక రంగుల ప్రపంచం లాంటిది. ఈ రంగుల ప్రపంచం చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. అందులో సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఫిమేల్ సినీ ఆర్టిస్టులు సినీ ఇండస్ట్రీ లో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది.
వివాదాల్లో చిక్కుకోవడం ఎందుకని, తమ సమస్యలను బయటకు చెప్పకుండా లోపలే అణచివేసుకొనేవారు ఎంతో మంది ఉన్నారు. క్యాస్టింగ్ కౌచ్ పేరుతో అనేక మంది ఫిమేల్ ఆర్టిస్టులు ఎదుర్కొన్న సమస్యలు ఎప్పటి నుంచో వార్తల్లో నిలుస్తూనే ఉన్నాయి. జూనియర్ ఆర్టిస్టులే కాదు స్టార్ హీరోయిన్స్ కూడా అనేక సమస్యలతో ఇండస్ట్రీలో సతమతమవుతున్నారు. నేను కూడా ఈ కోవకు చెందిన మహిళలలో ఒకదాన్ని.. అంటూ ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు నిత్యామీనన్.
కొంత కాలంగా సోషల్ మీడియాలో త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న నిత్యామీనన్ అంటూ వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. అసలు వివరాల్లోకి వెళితే.. ఆరేళ్లుగా నన్ను ఒక సమస్య వేధిస్తోంది. సంతోష్ వర్గీస్ అనే వ్యక్తి నన్ను పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. గత ఆరేళ్ల నుంచి నన్ను అన్ పాపులర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు అంటూ తన సమస్యపై ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సమస్య పట్ల నా తల్లిదండ్రులు నాకు అండగా నిలవడంతో అతనికి గట్టిగా వార్నింగ్ ఇచ్చాను. సంతోష్ తో నా వివాహం అనే ప్రచారంలో వాస్తవం లేదని ఆవేదన వ్యక్తంచేశారు నిత్యామీనన్.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…