Niharika Konidela : కొణిదెల నిహారిక.. ఈ పేరు చెబితే నిన్న మొన్నటి వరకు చాలా మంది అభిమానించేవారు. ఆమె చేసే అల్లరిని మెచ్చుకునేవారు. మెగా ఫ్యామిలీలో ముద్దుల కుమార్తెగా నిహారిక అల్లరి చేస్తూ సరదాగా తిరిగేది. కానీ అది గతం. కేవలం ఒక్క సంఘటన ఆమె లైఫ్‌ను తలకిందులు చేసింది. పబ్‌లో డ్రగ్స్‌కు సంబంధించిన కేసు ఏమోగానీ.. నిహారిక పేరు మారుమోగిపోయింది. ఆమెకు అసలు డ్రగ్స్‌తో సంబంధం ఉందా.. లేదా.. అన్న మాట పక్కన పెడితే.. ఇప్పుడు ఆమె జీవితం పూర్తిగా మారిపోయినట్లు అర్థమవుతోంది.
గతంలో నిహారిక ఆడింది ఆటగా.. పాడింది పాటగా ఉండేది. నాగబాబు కూడా తన కుమార్తెకు స్వేచ్ఛను బాగానే ఇచ్చారు. ఆమె హీరోయిన్ అవుతానని చెప్పినా.. సరే అన్నారు. కానీ ఆమె నటించిన సినిమాలు హిట్ కాలేదు. దీంతో సిరీస్‌లపై పడింది. అక్కడా పెద్దగా ఆదరణ లభించలేదు. దీంతో పెద్దల సూచన మేరకు నిహారిక పెళ్లి చేసుకుంది.
అయితే అత్త వారింట్లోనూ ఆమెకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఆ విషయాన్ని ఆమే ఒక పోస్టులో స్వయంగా వెల్లడించింది. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ.. నిహారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా డిలీట్ అయింది. ఆమె జిమ్ ట్రెయినర్‌తో చనువుగా ఉండడం ఆమె అత్తింటి వారికి నచ్చలేదని.. ఆ విషయంలో వారు ఆమెను మందలించారని.. కనుక ఆమె చిరాకు పడి ఇన్‌స్టా ఖాతాను డిలీట్ చేసిందని.. వార్తలు వచ్చాయి. ఇందులో నిజం ఎంత అనేది తెలియలేదు. కానీ ఆ తరువాత పబ్ సంఘటన చోటు చేసుకుంది. దీంతో నిహారికకు కష్టాలు మొదలయ్యాయి.
నిహారిక డ్రగ్స్ తీసుకోలేదని నాగబాబు చెప్పిన మాటలను నమ్మినా.. అర్థరాత్రి 3 గంటల సమయంలో తెలుగు పండుగ రోజు భర్త లేకుండా పబ్‌లో ఒక మహిళ ఉండడం ఏమిటి ? అని అందరూ సూటిగా ప్రశ్నించారు. దీనికి నాగబాబు వద్ద సమాధానం లేకుండా పోయింది. అతిగా స్వేచ్ఛను ఇవ్వడం వల్లే నిహారిక దాన్ని తప్పుగా ఉపయోగించుకుందని స్పష్టమైంది. కనుకనే ఆమెకు ఇప్పుడు అన్నీ కఠినమైన ఆంక్షలను విధించారట. దీంతో ఆమె ఇంట్లో నుంచి ఇప్పుడు బయటకు ఎక్కడికీ వెళ్లడం లేదట. ఒక రకంగా చెప్పాలంటే కొంత కాలం పాటు ఆమె ఇంట్లోనే బందీ అయిన జీవితం గడుపుతుందని తెలుస్తోంది.
అయితే నిహారిక ఆమెకు ఇచ్చిన స్వేచ్ఛను సద్వినియోగం చేసుకోలేదని.. అందువల్లే ఆమెపై ఇప్పుడు పుట్టింటి వారు, అత్తింటి వారు ఆంక్షలను విధించారని ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో నిజం ఎంత ఉంది.. అన్న విషయం తెలియాల్సి ఉంది. ఒకవేళ అదే నిజమైతే నిహారిక ఇక స్వేచ్ఛగా జీవించడం కుదరదు. ఒక రకంగా చెప్పాలంటే తన స్వేచ్ఛను తానే చేజేతులా వదులుకుందని తెలుస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…