Niharika Konidela : మెగా డాటర్ కొణిదెల నిహారిక ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను మళ్లీ యాక్టివేట్ చేసిన అనంతరం అందులో ఈమె వరుసగా పోస్టులు పెడుతోంది. ఈ మధ్యే భర్త చైతన్యతో కలిసి జోర్డాన్‌కు వెళ్లి వచ్చిన ఈమె అక్కడ పలు ప్రాంతాల్లో విహరించింది. ఎర్రని ఎండలో ఎరుపు రంగు దుస్తులను ధరించి ఈమె ఫొటోలకు పోజులు ఇచ్చింది. తరువాత ఓ చోట బహిరంగంగానే తన భర్తకు లిప్‌లాక్ ఇచ్చింది. దీంతో ఈ ఫొటోపై నెటిజన్లు ఆమెను తీవ్రంగా విమర్శలు చేశారు. ఇలాంటి ఫొటోలను ప్రయివేట్‌గా దాచుకోవాలి కానీ.. పబ్లిగ్గా షేర్ చేస్తారా.. అంటూ నెటిజన్లు మండిపడ్డారు. అయితే ఇప్పుడు నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఇంకో ఫొటోను షేర్ చేసింది. అయితే ఆ ఫొటోను షేర్ చేసిన ఆమె నెటిజన్లను ఓ ప్రశ్న కూడా అడిగింది.
నిహారిక తాజాగా ఓ ఫొటోను షేర్ చేసి దాంతోపాటు ఓ ప్రశ్న అడిగింది. ఆ ఫొటోలో ఉన్న నీడల ఆధారంగా టైమ్ ఎంత అవుతుందో చెప్పగలరా ? అంటూ ఆమె ప్రశ్న వేసింది. అయితే ఇందుకు నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఆమె అడిగిన ప్రశ్నకు సమాధానాలు చెబుతుండగా.. కొందరు మాత్రం ఆమెను విమర్శిస్తున్నారు.
ఆమె అడిగినట్లుగా టైమ్ ఉదయం 10-11 గంటల మధ్య లేదా మధ్యాహ్నం 2-3 గంటల మధ్య ఉంటుందని కొందరు బదులిచ్చారు. ఇక ఈ ఫొటోలో అద్భుతంగా ఉన్నావని ఇంకొందరు కామెంట్లు చేశారు. నీకు పనీ పాట ఏమీ లేదా.. అని ఇంకొందరు కామెంట్లు చేశారు. ఈ క్రమంలోనే ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాగా నిహారిక ఈ మధ్యే డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన విషయం విదితమే. తరువాత బెయిల్‌పై బయటకు వచ్చింది. అయితే నాగబాబు, ఆయన భార్య మాత్రం తమ కూతురికి ఏమీ తెలియదని అన్నారు. దీంతో నెటిజన్లు నాగబాబును ట్రోల్ చేశారు. నీ కుమార్తెకు ఏమీ తెలియకపోతే అర్థరాత్రి పూట తెలుగు సంవత్సరం రోజు భర్త లేకుండా ఒక పబ్‌లో ఏం చేస్తుంది.. ఉగాది పచ్చడి తినేందుకు వెళ్లిందా.. అంటూ నాగబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. అయితే ఇందుకు మాత్రం ఆయన బదులు చెప్పలేదు. ఇక నిహారిక త్వరలోనే ఓ ప్రముఖ చానల్‌లో ట్రావెల్ షోను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారికంగా వివరాలను వెల్లడించనున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…