Nidhi Agerwal : నిధి అగర్వాల్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. మున్నా మైకెల్ అనే బాలీవుడ్ మూవీతో సినీ కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ. నాగ చైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత అఖిల్‌తో మిస్టర్ మజ్ను చేసిన నిధి.. పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ మూవీలో రామ్‌కు జోడీగా జతకట్టి ఫస్ట్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఈ మూవీ హిట్ అవ్వడంతో నిధికి వరుసగా అవకాశాలు వస్తాయని అంతా భావించారు. కానీ నిధి మాత్రం నత్త నడక మాదిరిగా సినిమాలు చేస్తోంది.
దీంతో ఆమెకు ఆఫర్లు రావడం లేదని ప్రచారం కూడా మొదలైంది. ఈ విషయంపై నిధి స్పందిస్తూ.. అవకాశాలు వస్తున్నాయి. వచ్చిన సినిమానల్లా ఒప్పేసుకుంటూ పోతే.. ఎంత త్వరగా క్రేజ్ వస్తుందో అంతే త్వరగా పోతుంది. ప్రస్తుతం మంచి పాత్రల కోసం ఎదురుచూస్తున్నా అంటూ చెప్పుకొచ్చింది. ఇటీవల హీరో మూవీతో ప్రేక్షకులను పలకరించిన ఈ అందాల భామ.. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు జోడీగా క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు మూవీలో నటిస్తోంది.
ఇదిలా ఉంటే ఈ హాట్ బ్యూటీ ఓ స్టార్ క్రికెటర్ తో లవ్ ఎఫైర్ నడిపిస్తున్నట్టు బాలీవుడ్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆ స్టార్ క్రికెటర్ మరెవరో కాదు ఇండియన్ క్లాసిక్ బ్యాట్స్ మన్ కేఎల్ రాహుల్. వీళ్ళిద్దరూ కలిసి దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత కొంతకాలంగా రాహుల్.. నిధి అగర్వాల్ తో డేటింగ్ చేస్తున్నాడని ఇండస్ట్రీలో కూడా టాక్ ఉంది. అయితే ఇదే విషయంపై మీడియా ప్రశ్నించగా తాము స్నేహితులం మాత్రమే అంటూ ఆ వార్తల్ని కొట్టి పారేస్తున్నారు. ఈ వార్తల్లో నిజమెంతుందో మరికొన్ని రోజుల్లో తెలుస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…