Keerthy Suresh : సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ చిత్రం.. సర్కారు వారి పాట. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి రికార్డు స్థాయిలో కలెక్షన్ల దిశగా దూసుకుపోతోంది. ఇక ఇందులో మహేష్‌కు జోడీగా కీర్తి సురేష్ నటించింది. ఈ అమ్మడికి అసలు మహానటి మూవీ తరువాత హిట్స్ లేవు. మరోవైపు మహేష్.. మహర్షి, సరిలేరు నీకెవ్వరు మూవీలతో వరుస విజయాలను అందుకున్నారు. దీంతో కీర్తిసురేష్ లాంటి ఐరన్ లెగ్ హీరోయిన్‌ను ఎందుకు తీసుకున్నారంటూ.. గతంలోనే మహేష్ ఫ్యాన్స్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆమె వల్ల సినిమా ఫ్లాప్ అవుతుందేమోనని కంగారు పడ్డారు. కానీ అలా జరగలేదు. సినిమా పాజిటివ్ టాక్‌నే సొంతం చేసుకుంది. అయితే కీర్తి సురేష్‌ను మాత్రం నెటిజన్లు ఒక ఆట ఆడుకుంటున్నారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
సర్కారు వారి పాట మూవీలో కీర్తి సురేష్ భిన్నమైన పాత్రలో నటించింది. ఫ్యామిలీ ఆడియన్స్‌కు తగినట్లుగా పాత్రలు చేసే ఆమె ఒక్కసారిగా మందుకు, జూదానికి బానిస అయినట్లుగా ఈ మూవీలో నటించింది. అయితే ఫ్యామిలీ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నకీర్తి సురేష్ ఈ మూవీలో అలాంటి పాత్రలో కనిపించే సరికి నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. గతంలో ఏ సినిమా చూసుకున్నా ఆమె ఎంతో పద్ధతిగా ఫ్యామిలీ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యే పాత్రల్లో నటించింది. కానీ సర్కారు వారి పాటలో మాత్రం అందుకు భిన్నంగా.. మందులో మునిగి తేలే పాత్రలో నటించింది. పైగా సినిమాలో ఆమె పాత్ర చిత్రీకరణ ఏమంత బాగా లేదు. మాటి మాటికీ విసిగిస్తుంటుంది. అసలు ఆమె తెరపై కనిపిస్తేనే.. ఎప్పుడు వెళ్లిపోతే బాగుంటుందా.. అన్నట్లు ప్రేక్షకులు ఫీలవుతున్నారు. చాలా విసుగు, కోపం తెప్పించే పాత్రలో ఆమె కనిపించింది. పైగా మద్యం, జూదం.. వీటికి బానిసగా.. అప్పుల మీద అప్పులు చేసే చెడ్డ యువతిగా కనిపించింది. ఇది ప్రేక్షకులకు నచ్చలేదు.
కీర్తి సురేష్ అంటే హోమ్లీ పాత్రలకు పెట్టింది పేరు. అలాంటిది ఆమె ఇలా చేసింది ఎందుకబ్బా.. అని ప్రేక్షకులు ఆలోచిస్తున్నారు. అయితే పాత్ర అలాంటిది.. చిత్ర కథకు అవసరం.. అని సరిపెట్టుకుందామనుకుంటే.. ఇంకో ప్రశ్న వస్తుంది. అసలు ఆమె ఇలాంటి పాత్రకు ఎందుకు ఒప్పుకుంది.. ఇలాంటి పాత్ర చేస్తే నెగెటివ్ ఇమేజ్ పడుతుంది కదా.. ఫ్యామిలీ ఆడియన్స్‌కు నచ్చదు కదా.. అన్న ప్రశ్నలు వస్తున్నాయి. అన్నీ తెలిసే కీర్తి సురేష్ ఈ పాత్రకు ఒప్పుకుందని.. ఆమె అసలు ఇలాంటి పాత్రలలో నటించవద్దని.. కానీ నటించి తప్పు చేసిందని అంటున్నారు. దీని వల్ల ఆమె కెరీర్‌పై ప్రభావం పడుతుందని అంటున్నారు. ఈ సినిమాలో ప్రేక్షకులకు ఆమె పాత్ర విసుగు, కోపం తెప్పిస్తాయి. కనుక ఈమె పాత్రను వారు ఇష్టపడడం లేదు. ఈ క్రమంలోనే కీర్తి సురేష్‌ను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ మూవీతో అయినా ఈ అమ్మడి దశ తిరుగుతుందా.. లేక అవకాశాలు తగ్గుతాయా.. అన్న విషయం వేచి చూస్తే తెలుస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…