Chiranjeevi : టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరో ఎవరు అని అడిగితే ముందుగా గుర్తుకు వచ్చేది మెగాస్టార్ చిరంజీవి. ఆయన సుదీర్ఘమైన సినీ ప్రయాణంలో ఎన్నో అద్భుత విజయాలను సొంతం చేసుకున్నారు. పునాదిరాళ్లు చిత్రంతో చిరంజీవి తన కెరీర్ ని స్టార్ట్ చేసి దాదాపు 150 చిత్రాలకు పైగా నటించి సుప్రీం హీరోగా, మెగాస్టార్ గా ఎదిగి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. 2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి మెగాస్టార్ చిరంజీవి 10 సంవత్సరాలు రాజకీయాల్లో కొనసాగి మళ్లీ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టినా కూడా తెలుగు ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు.
రాజకీయాల కారణంగా చిత్రాలకి ఇక దూరంగా ఉంటారు అనుకునే ఉద్దేశంతో ఉన్న ప్రజల అంచనాలను తారుమారు చేస్తూ ఖైదీ నెంబర్ 150 చిత్రంతో తిరిగి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు. ఎంతో స్టార్ డమ్ ఉన్న మెగాస్టార్ రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వచ్చిన అవకాశాలను సరిగ్గా వినియోగించుకోలేకపోతున్నారు. ఆయనకు ఈ మధ్య కష్టకాలం నడుస్తుంది అంటూ స్వయంగా ఆయన అభిమానులే కామెంట్ చేస్తున్నారు.
దాదాపు రెండు సంవత్సరాలు ఎదురు చూసిన ఆచార్య చిత్రం ప్రేక్షకులకు నిరాశను మిగిల్చింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయం పాలైంది. నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు కూడా భారీ నష్టాలు చవి చూపించింది. ఆచార్య చిత్రం డిజాస్టర్ కావడంతో డైరెక్టర్ కొరటాల శివ కూడా తన ఆస్తులు అమ్ముకునే స్థితికి వచ్చేశారు. బాలీవుడ్ మూవీ లాల్ సింగ్ చద్దాని తెలుగులో చిరంజీవి ప్రెజెంట్ చేసిన విషయం తెలిసిందే. అమీర్ ఖాన్, నాగచైతన్య కలిసి నటించిన లాల్ సింగ్ చద్దా దారుణమైన రిజల్ట్ అందుకుంది. ఆచార్య చిత్రం డిజాస్టర్ నుంచి తేరుకోకముందే లాల్ సింగ్ చద్దా చిత్రం రిజల్ట్ కూడా ఆయన్ని మరింత ఇబ్బంది పెట్టింది.
మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ఫస్ట్ డే ఫస్ట్ షో చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో కూడా పాల్గొన్నారు. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇలా మెగాస్టార్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లకి పాల్గొన్న చిత్రాలన్నీ ఫ్లాపులను అందుకోవడంతో మెగాస్టార్ కి బ్యాడ్ టైం నడుస్తుంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీంతోపాటు కొందరైతే ఏకంగా ఆయనను ఐరన్ లెగ్ అని అంటున్నారు. అయితే త్వరలో ఆయన నటించిన గాడ్ ఫాదర్ రిలీజ్ కానుంది. మరి ఈ మూవీ ఎలా అలరిస్తుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…