సోషల్ కంటెంట్ కి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి ప్రేక్షకులను మెప్పించే డైరెక్టర్ కొరటాల శివ. అలాంటి డైరెక్టర్ మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తున్నారంటే అంచనాలు మామూలుగా ఉండవు. అందులోనూ చిరు, చరణ్ కలిసి నటిస్తున్నారంటే ఫ్యాన్స్ కి పండగే అనుకున్నారు. కానీ ఆచార్య సినిమా చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చిన అభిమానులకు కథ ఏమిటి అని ఆలోచిస్తే.. పెద్దగా ఏమీ గుర్తు రాదు..!? దర్శకత్వంలో, సంభాషణల్లో కొరటాల మార్క్ మిస్ అయింది.
దీంతో ఆచార్య ఎఫెక్ట్ మెగాస్టార్ చిరంజీవిపై పడింది. సినిమా బాక్సాఫీస్ పరాజయం ఒకెత్తయితే.. దీంతో చిరంజీవి సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురయ్యారు. శనివారం తెల్లవారు జామున చిరంజీవి బింబిసార, సీతా రామం గురించి ట్వీట్ చేశారు. ఆ సినిమాలకు వస్తున్న పాజిటివ్ బజ్ పై వారికి అభినందనలు తెలిపారు మెగాస్టార్.
అయితే దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. నువ్వు సినిమాలు చేయడం మానేస్తే ఇండస్ట్రీ బాగుపడుతుంది, డిస్ట్రిబ్యూటర్లు కూడా బాగుంటారు ప్లీజ్ టాలీవుడ్ ని కాపాడండి బాసు.. అని కామెంట్ చేశాడు. మెగాస్టార్, రామ్ చరణ్.. అబ్బా, కొడుకులు చేసిన లాస్ ఎఫెక్ట్ ని కళ్యాణ్ రామ్ ఎత్తి పడేశాడు. నీకెందుకు మెగాస్టార్ ట్యాగ్ చెప్పు.. అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.
అయితే చిరంజీవి లాంటి మెగాస్టార్‌ని ఇలా కించపరిచేలా ఒక్క ఫ్లాప్‌ని వాడుకోవడం పూర్తిగా అన్యాయం అనే చెప్పవచ్చు. సోషల్ మీడియా ట్రోల్స్ ఒక విషయం అయితే.. ఇలాంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలతో చిరుని తక్కువ చేసి మాట్లాడడం సరైంది కాదు.. అని మెగా ఫ్యామిలీ అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…