Chinmayi : సింగర్ చిన్మయి శ్రీపాద, నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దంపతులకు కవలలు జన్మించిన విషయం విదితమే. తాజాగా వారు తమ పిల్లలను తమ జీవితాల్లోకి ఆహ్వానించారు. ఈ క్రమంలోనే వారి పూర్తి ఫొటోలను షేర్ చేయకుండా.. చేతులు పట్టుకున్న ఫొటోలను దిగి షేర్ చేశారు. దీంతో వారికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే చిన్మయి అంటేనే చాలా మంది నెటిజన్లు ట్రోలింగ్ మొదలు పెడతారు. ఈ క్రమంలోనే ఆమె పెట్టిన పోస్టులపై మళ్లీ ట్రోలింగ్ మొదలైంది.
సింగర్ చిన్మయి గర్భం ధరించినట్లుగా ఉన్న ఫొటోలు ఎక్కడా బయటకు రాలేదు. మరలాంటప్పుడు ఆమెకు జన్మించిన ఈ పిల్లలను ఆమెను కన్నదా.. లేక సరోగసీ ద్వారా వాళ్లను కన్నదా.. అంటూ నెటిజన్లు ఆమెను ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. చాలా మంది ఆమెకు డైరెక్ట్ మెసేజ్‌లను కూడా పంపిస్తున్నారు. అయితే దీనిపై చిన్మయి స్పందించింది.
తన ప్రసవంపై చాలా మందికి అనుమానాలు ఉన్నాయని చిన్మయి తెలియజేసింది. అయితే తన గర్భం ఫొటోలను సోషల్ మీడియాలో కావాలనే పోస్ట్ చేయలేదని.. అంతమాత్రాన తనకు పిల్లలు పుడితే సరోగసీ ద్వారా కన్నానని ఎలా అంటారని ప్రశ్నించింది. తాను ప్రసవం సమయంలో తన పిల్లల సేఫ్టీ కోసం భజన మంత్రాలను చదివానని చెప్పింది. అంతేకాదు.. వారి ఫొటోలను కూడా ఇప్పుడప్పుడే సోషల్ మీడియాలో పెట్టలేనని.. తమకు ప్రైవసీ కావాలని ఆమె కోరింది. ఈ క్రమంలోనే చిన్మయి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…