Natu Natu Song : దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన క్రేజీ ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్. ఈ సినిమా మొదటి రోజు నుండి మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమాలోని సాంగ్స్ ప్రేక్షకులని ఎంతగా అలరించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా చిత్రంలోని నాటు నాటు సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఈ పాటకు పలువురు డ్యాన్స్ చేస్తూ వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. రీసెంట్‌గా నాటు నాటు అంటూ సాగే పాటకు ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు డ్యాన్స్ చేశారు. ఓ కార్యక్రమంలో ఆయన ఓ బాలుడితో కలిసి వేదికపై డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలా ఉండగా నాటు నాటు పాట చాలా మంది ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.
ఈ పాటకు ఇటీవల దిల్ రాజు ఇచ్చిన పార్టీలో దర్శకులు రాజమౌళి, అనిల్ రావిపూడి కలిసి స్టెప్పులు వేయడం కూడా వైరల్ అవుతోంది. మరోవైపు ఈ సినిమాలోని ఒరిజినల్ సౌండ్ వెర్షన్‌ను త్వరలోనే విడుదల చేస్తామని సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి తాజాగా వెల్లడించడం సంగీత అభిమానులను సంతోషపరుస్తోంది. అయితే సిల్వర్ స్క్రీన్ పై ఇద్దరు హీరోల ఎనర్జిటిక్ స్టెప్స్ గూస్ బంప్స్ కలిగించాయి. విజువల్ ట్రీట్ గా ప్రేక్షకులు పొగుడుతున్న ఈ నాటు నాటు సాంగ్ కూడా కాపీనే అంటున్నారు కొందరు. బ్లాక్ అండ్ వైట్ కాలం నాటి హాలీవుడ్ కమెడియన్స్ ఓ సాంగ్ కి చేసిన స్టెప్స్ నాటు నాటు సాంగ్ కి దగ్గరగా ఉన్నాయి.
సదరు వీడియోను తెరపైకి తెచ్చిన నెటిజెన్స్.. రాజమౌళి వారిని కాపీ చేశారంటున్నారు. నాటు నాటు సాంగ్ కు కొరియోగ్రఫీ చేసిన ప్రేమ్ రక్షిత్ కి రాజమౌళి సూచనలు చేసి ఉంటారని అంటున్నారు. ఎప్పుడో వందేళ్ల క్రితం పాటలో ఇద్దరు ఆర్టిస్టుల డ్యాన్స్‌ను సింక్ చేస్తూ డాన్స్ చేసినంత మాత్రాన నాటు నాటు సాంగ్ ని కాపీ చేశారనడంలో అర్థం లేదంటున్నారు. ఆ మాటకు వస్తే ఇండియాలో ఇప్పటికే ఇద్దరు హీరోలు కలిసి డాన్స్ చేసిన పాటలు ఉన్నాయంటున్నారు. ఏదో చాదస్తం కానీ రాజమౌళి సినిమాల విషయంలో ప్రతీది కాపీ అంటూ కొందరు స్టన్నింగ్ కామెంట్స్ చేస్తుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఆర్ఆర్ఆర్ మూవీతో రాజమౌళి మరొక ఇండస్ట్రీ హిట్ ను ఖాతాలో వేసుకున్నారు. తెలుగు స్టేట్స్ లో ఏకంగా బాహుబలి 2 రికార్డ్స్ బ్రేక్ చేసిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ.వెయ్యి కోట్ల వసూళ్లు దాటేసింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…