Malavika Mohanan : మాళవిక మోహనన్.. ఈ అమ్మడు తెలుగులో అసలు సినిమాలు ఒక్కటి కూడా చేయలేదు. అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు ఈ ముద్దుగుమ్మ గురించి బాగానే తెలుసు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈమె చేసే గ్లామర్ షో అంతా ఇంతా కాదు. ఎల్లప్పుడూ ఈమె అందులో తన అందాల ఆరబోత ఫొటోలను షేర్ చేస్తూనే ఉంటుంది. అలా ఈమె తెలుగు ప్రేక్షకులకు కూడా తెలుసు. ఈమె సినిమాల్లోకి రాకముందు మోడల్. కనుక స్వతహాగానే తరచూ ఫొటోషూట్స్ చేస్తూ అలరిస్తుంటుంది. అయితే మాళవిక మోహనన్ను ఓ నెటిజన్ కొంటె ప్రశ్న అడిగాడు. అందుకు ఆమె కూడా దీటుగా సమాధానం చెప్పింది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
మాళవిక మోహనన్ ఇటీవల ట్విట్టర్‌లో ఓ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించింది. తన ఫాలోవర్లతోపాటు అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానాలు చెప్పింది. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ ఆమెను కొంటె ప్రశ్న అడిగాడు. ఆమె ఇటీవల ధనుష్‌తో కలిసి మారన్ అనే తమిళ సినిమాలో నటించిన విషయం విదితమే. అందులో ధనుష్, మాళవికల మధ్య ఓ బెడ్ సీన్ ఉంటుంది. అయితే ఈ సీన్ కోసం ఎన్ని టేక్స్ తీసుకున్నారు ? ఎన్నిసార్లు చేస్తే ఈ సీన్ చక్కగా వచ్చింది ? అంటూ అతను ప్రశ్న అడిగాడు.
అయితే ఇందుకు మాళవిక మోహనన్ కూడా దీటుగానే రిప్లై ఇచ్చింది. నీ తలలో ఏదో పాడైనట్లుంది.. అంటూ మాళవిక ఆ నెటిజన్ కు దిమ్మ తిరిగేలా రిప్లై ఇచ్చింది. ఇక ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మాళవిక మోహనన్ ఇప్పటి వరకు తమిళ సినిమాల్లోనే నటించింది. తెలుగులో సినిమాలు చేయలేదు. కానీ త్వరలోనే ప్రభాస్, మారుతిల కాంబినేషన్‌లో రానున్న సినిమాలో ఈమె నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…