Rana Daggubati : సెలబ్రిటీలు అన్నాక విమర్శలు, పొగడ్తలు సహజం. వారు చేసే కొన్ని పనులకు లేదా వారు తీసే సినిమాలకు కొన్ని సార్లు విమర్శలు వస్తుంటాయి. కొన్ని సార్లు పొగడ్తలు వస్తుంటాయి. అయితే చాలా మంది సెలబ్రిటీలు విమర్శలు అయినా, పొగడ్తలు అయినా.. పెద్దగా పట్టించుకోరు. తమ పని తాము చేసుకుపోతుంటారు. కానీ కొందరు మాత్రమే వాటిని పట్టించుకుంటారు. పొగడ్తలు చేసే వారికి థ్యాంక్స్ చెబుతారు. విమర్శించే వారికి దీటుగా బదులిస్తారు. ప్రస్తుతం రానా కూడా అలాగే చేశాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
దగ్గుబాటి రానా, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం.. విరాట పర్వం. ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్‌ను ఈమధ్యే లాంచ్ చేశారు. అందులో రానా ముఖం కనిపించడం లేదు. కానీ ఆయనను హగ్ చేసుకున్న సాయిపల్లవినే హైలైట్ చేసి చూపించారు. అయితే రానాను వదిలేసి ఆమె మీద ఫోకస్ పెట్టడంపై ఓ నెటిజన్ రానాను విమర్శించాడు. ఛీ దరిద్రం.. సొంత బ్యానర్‌లోనే ఫేస్ కట్ చేశారు. ఇక బయటి వాళ్లు వేలెత్తి చూపించడంలో తప్పేముందిలే.. వాళ్ల వీళ్ల సినిమాల్లో తక్కువ క్యారెక్టర్స్ చేయడం అందరికీ లోకువ అయిపోవడం.. ఇది రానాకు సహజమేగా.. అంటూ ఆ నెటిజన్ కామెంట్ చేశాడు. అయితే ఇందుకు రానా స్పందించారు. సదరు నెటిజన్‌కు చెంప పెట్టు లాంటి సమాధానం ఇచ్చారు.
మనం తగ్గి కథను, హీరోయిన్‌ను ఎలివేట్ చేయడంలో ఉండే కిక్కే వేరు బ్రదర్. సొంత బ్యానర్ కదా. గొప్ప పనులు ఇక్కడే చేయవచ్చు.. అని రానా బదులిచ్చారు. దీంతో ఆ నెటిజన్‌కు గూబ గుయ్‌మని అనిపించి ఉంటుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆ నెటిజన్‌కు దీటుగా బదులిచ్చావని రానాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక విరాట పర్వం షూటింగ్ ఎప్పుడో ముగిసినా ఈ మూవీ అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు దీన్ని జూన్ 17న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. శ్యామ్ సింగరాయ్ తరువాత వస్తున్న సాయిపల్లవి సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయని చెప్పవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…