Nayanthara : లేడీ సూపర్ స్టార్‌గా పేరుగాంచిన నయనతార, దర్శకుడు విగ్నేష్ శివన్ ఎన్నో ఏళ్ల తమ ప్రేమ బంధానికి ముగింపు పలికి ఇటీవలే పెళ్లి చేసుకున్న విషయం విదితమే. జూన్ 9వ తేదీన వీరు మహాబలిపురంలోని గ్రాండ్ షెరటాన్ హోటల్‌లో అంగరంగవైభవంగా వివాహం చేసుకున్నారు. ఈ సందర్భంగా వీరు ఆ ఒక్క రోజు తమిళనాడులోని సుమారు 1 లక్ష మంది పేదలకు అన్నదానం చేసి గొప్ప మనసు చాటుకున్నారు. అయితే వీరి పెళ్లికి ఎంతో మంది ప్రముఖులు హాజరయ్యారు. కానీ ఒక్క వ్యక్తిని మాత్రం పెళ్లికి ఎందుకు పిలిచావంటూ నయనతారపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
మళయాళ నటుడు దిలీప్ కుమార్ గురించి తెలుగు ప్రేక్షకులు పెద్దగా పరిచయం లేదు. కానీ తమిళం, మళయాళం ప్రేక్షకులకు బాగానే తెలుసు. అయితే అప్పట్లో ఇతనిపై హీరోయిన్ భావన సంచలన ఆరోపణలు చేసింది. తన సోదరుడితో కలిసి దిలీప్ కుమార్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని భావన ఆరోపణలు చేసింది. అయితే అలాంటి వ్యక్తిని నీ పెళ్లికి ఎందుకు పిలిచావు.. అతన్ని పిలవాల్సిన అవసరం ఏముంది.. అంటూ నయనతారను ప్రశ్నిస్తూ.. ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ విషయం సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది.
ఇక నయనతార ఇటీవలే భర్త విగ్నేష్‌తో కలసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. అయితే మాడ వీధుల్లో వీరు చెప్పులు ధరించి తిరగడం వివాదాస్పదం అయింది. దీంతో వారిని టీటీడీ వివరణ కోరింది. ఈ క్రమంలోనే నయన్, విగ్నేష్ దంపతులు టీటీడీకి లిఖిత పూర్వకంగా క్షమాపణలు చెప్పారు. దీంతో ఈ వివాదం సద్దుమణిగింది.
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ గురించి అందరికీ తెలిసిందే. ఈయన ఏది చేసినా సంచలనమే అవుతుంది. అయితే తాజాగా ఈయన…
బ్యాంకు ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారికి కెనరా బ్యాంక్ గుడ్ న్యూస్ చెప్పింది. కెనరా బ్యాంకులో కాంట్రాక్టు బేసిస్ విధానంలో స్పెషలిస్ట్…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను…
న్యూఢిల్లీలో ఉన్న ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ ప్రైవేటు బ్యాంకింగ్ సంస్థల్లో ఒకటైన హెచ్డీఎఫ్సీ బ్యాంకు పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న…
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న…
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న…