Nayanthara : నయనతార సినిమా ఇండస్ట్రీకి వచ్చి దాదాపుగా 20 ఏళ్లు కావస్తోంది. అయినప్పటికీ చెక్కు చెరగని అందం ఆమె సొంతం. అలాగే ఆమె ఇప్పటికీ ఆఫర్లను అందుకుంటూ వస్తోంది. అయితే గ్లామర్ షోకు బైబై చెప్పేసిన ఈ ముద్దుగుమ్మ ఫీమేల్ ఓరియెంటెడ్ పాత్రలలో నటించేందుకే ఎక్కువ మొగ్గు చూపుతోంది. ఈమధ్యే ఈమె కాతువాకుల రెండు కాదల్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ మూవీ తెలుగులో ఫ్లాప్ కాగా.. తమిళంలో హిట్ అయింది. ఇక ఇన్నేళ్ల నుంచి సినిమా ఇండస్ట్రీలో అనేక లేడీ ఓరియెంటెడ్ పాత్రల్లో నటించినందుకు గాను ఈమె లేడీ సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకుంది. అయితే నయనతార ఇన్నేళ్లయినా అందం మాత్రం కొంచెం కూడా తగ్గలేదు. ఇక ఆమె అందం, డైట్ సీక్రెట్ ఏమిటి.. అనే విషయానికి వస్తే..
నయనతార ఇటీవల తన అందం, డైట్ సీక్రెట్స్ ఏంటో చెప్పేసింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తాను వెయిట్ ట్రెయినింగ్ ఎక్కువగా చేస్తానని.. అలాగే యోగా తప్పనిసరి అని తెలియజేసింది. రోజంతా డీహైడ్రేషన్ బారిన పడకుండా చల్లగా కూల్ కూల్‌గా ఉండేందుకు కొబ్బరినీళ్లను ఎక్కువగా తాగుతానని చెప్పింది. దీంతోపాటు చక్కెరను అసలు తీసుకోనని, పండ్లను అధికంగా తింటానని తెలియజేసింది.
అలాగే తక్కువ తిను.. ఎక్కువగా పనిచేయి.. అన్న సూత్రాన్ని తాను పాటిస్తానని నయనతార తెలియజేసింది. అందువల్లే ఆరోగ్యంగా ఉండగలుగుతున్నానని చెప్పింది. ఇక నయనతార ప్రస్తుతం ఓ2 అనే తమిళ మూవీలో నటిస్తుండగా.. ఇది పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. అలాగే మళయాళంలో గోల్డ్ అనే మూవీ చేస్తోంది. ఇది కూడా షూటింగ్ కంప్లీట్ అయి పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇక హిందీలో జవాన్, తెలుగులో గాడ్‌ఫాదర్, తమిళంలో కనెక్ట్ అనే మూవీల్లో నటిస్తోంది. ఇవి షూటింగ్ దశలో ఉన్నాయి. త్వరలోనే ఈమె తన ప్రియుడు విగ్నేష్ శివన్‌ను వివాహం చేసుకోనుంది. ప్రస్తుతం ఆ పనుల్లో వారు బిజీగా ఉన్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…