Natu Natu Song : ఇద్దరు స్టార్ హీరోలతో సినిమా చేయాలంటే అది రిస్క్‌తో కూడుకున్న పని. ఇరువురు హీరోల అభిమానులని మెప్పించడం అనేది పెద్ద టాస్క్. అయితే అలాంటి టాస్క్‌ని హ్యాపీగా స్వీకరించాడు రాజమౌళి. ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో ఆర్ఆర్ఆర్ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వెయ్యి కోట్ల వసూళ్లు రాబట్టింది. అంతేకాదు ఇంటా బయటా కూడా మంచి ప్రశంసలు అందుకుంది. అయితే గుడ్డు మీద ఈకలు పీకే వాళ్లు ఏదో వంక చూపిస్తూ ట్రోల్ చేస్తూనే ఉన్నారు. తాజాగా నాటు నాటు సాంగ్ విషయంలో ట్విట్టర్ వేదికగా వార్ నడుస్తోంది.
తాజాగా నాటు నాటుకు చెందిన వీడియో సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక ఈ సాంగ్ లో ఎన్టీఆర్, చరణ్ ల డాన్స్ ను చూస్తూ ప్రేక్షకులు మైమరిచిపోతున్నారు . ఇద్దరు స్టార్ హీరోలు అలా డాన్స్ చేస్తుంటే చూడడానికి రెండు కళ్లు చాలడం లేదంటున్నారు అభిమానులు. బ్రిటిష్ వారి ముందు తెలుగు నాటును చూపించి మెప్పించారు. ఈ సాంగ్ కోసం రాజమౌళి ఎంతో కష్టపడినట్లు తెలిపారు. ఈ సాంగ్ కోసం మేము పడ్డ కష్టం అంతా ఇంతా కాదని.. చరణ్, తారక్ ఇంటర్వ్యూలలో చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఈ ఇద్దరిలో ఎవరు బాగా చేశారు.. అనే దానిపై ట్విట్టర్ వేదికగా వార్ నడుస్తోంది.
ఇద్దరు స్టార్స్ డ్యాన్స్ కదలికల మధ్య సింక్ కాని స్టెప్స్ ఎత్తి చూపుతూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఫాస్ట్ బీట్‌లో ఇద్దరు హీరోల డ్యాన్స్ విషయంలో చాలా తేడాలు గమనించారు. ఈ సాంగ్ కోసం 17 టేకులు చేయించానని చెప్పిన రాజమౌళి మరి ఇంత నాన్ సింక్‌గా ఎలా చూపించాడంటూ కొందరు విమర్శిస్తున్నారు.
ఇద్దరు హీరోల్లో రెండు అంశాల కోసం బాగా మాట్లాడుకుంటున్నారు. ఒకటి ఎన్టీఆర్ మెరుపు వేగంతో చేసిన డాన్స్ మూమెంట్స్ కాగా రెండోది చరణ్ ఈ సాంగ్ లో చూపించిన గ్రేస్.. పలు సందర్భాల్లో తాను పలికించిన హావ భావాలు. ఈ సాంగ్ వచ్చాక అందరూ ఆయా అంశాల కోసమే ఎంతగానో మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి అయితే ఈ సాలిడ్ సాంగ్ మళ్లీ ఇలా హాట్ టాపిక్‌గా మారిపోయింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…