Natu Natu Song : రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం మరో రెండు నెలలో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా మూవీ నుండి ఒక్కో సాంగ్ విడుదల చేస్తున్నారు. ముందుగా దోస్తీ అనే సాంగ్ విడుదల చేయగా, దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక రీసెంట్‌గా నాటు నాటు అనే సాంగ్ విడుదల చేశారు. కీరవాణి స్వరపరిచిన ఈ సాంగ్ కి కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ అద్భుతమైన స్టెప్స్ అందించారు.
టాలీవుడ్ టాప్ డాన్సర్స్ గా ఉన్న ఎన్టీఆర్, రామ్ చరణ్ నాటు నాటు సాంగ్‌కి మెరుపు వేగంతో ఒక్కసారిగా కాళ్లు కదపగా.. ఈ సాంగ్ బాగా వైరల్ అయ్యింది. ఈ పాటకున్న క్రేజ్ నేపథ్యంలో పలువురు నాటు నాటు సాంగ్ లోని హీరోల స్టెప్స్ ను అనుకరిస్తూ కవర్ సాంగ్స్ చేస్తున్నారు. ఓ బామ్మ ఇదే సాంగ్‌కి డ్యాన్స్ వేసి ఆశ్చర్యపరచింది. ఇక రీసెంట్‌గా బిగ్ బాస్ ఫేమ్ సోహైల్, మెహబూబ్ నాటు నాటు సాంగ్ కి తమదైన రీతిలో డాన్స్ చేశారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ గుర్తుకు వచ్చేలా అద్భుతంగా స్టెప్స్ వేశారు.
తాజాగా ఓ వ్యక్తి ఓ వ్యక్తి బైక్‌పై వెళుతున్నాడు.. అదేసమయంలో ట్రాఫిక్ సిగ్నల్ పడింది. తలకు హెల్మెట్ ధరించిన ఆ వ్యక్తి బైక్ నుంచి దిగి ‘నాటు నాటు’ పాటకు స్టెప్పులేశాడు. దీంతో అక్కడున్న వారంతా ఈ సీన్ కు తొలుత షాక్‌కి గురయ్యారు. కానీ తర్వాత విషయం తెలుసుకొని తమ మొబైల్ ఫోన్‌ను తీసి వీడియో తీయడం ప్రారంభించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో కాస్తా ఆర్‌ఆర్‌ఆర్ మేకర్స్ దృష్టిలో పడింది. దీంతో ఈ వీడియోను రీట్వీట్ చేసిన చిత్ర యూనిట్ ‘మాస్’ అనే క్యాప్షన్ ను జోడించింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…