Nagarjuna : టాలీవుడ్ క్యూట్ కపుల్‌గా ఉన్న సమంత, నాగచైతన్య విడాకులు తీసుకోవడం సినీ ఇండస్ట్రీలో ఎంతో మందిని షాక్‌కు గురి చేసింది. అక్కినేని అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. అయితే ఈ సంగతి అలా ఉంచితే కొన్ని యూట్యూబ్ చానల్స్, వెబ్‌సైట్లు ఈ విషయంలో కాస్త హద్దు మీరి ప్రవర్తించినట్లు అర్థమైంది. ఈ క్రమంలోనే సమంత వారిపై కోర్టు వరకు వెళ్లి క్షమాపణలు చెప్పేలా చేసింది.
అయితే నాగచైతన్య, సమంతల విడాకుల విషయమై నాగార్జున ఎప్పుడూ స్పందించలేదు. కానీ తాజాగా ఆయన ఓ ఆంగ్ల మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై ఎట్టకేలకు స్పందించారు. నాగచైతన్య, సమంతల విడాకుల విషయమై ఆయన తొలిసారిగా మాట్లాడారు.
కావాలనే కొందరు పనిగట్టుకొని చెత్త రాతలు రాస్తున్నారు. ముఖ్యంగా యూట్యూబ్ ఇలాంటి ఫేక్ వార్తలకు వేదికగా మారుతోంది. ఇలాంటి ఫేక్ న్యూస్‌ను నేను పట్టించుకోను.. అని నాగార్జున అన్నారు.
అయితే సమంత, చైతన్య ఇద్దరూ విడాకుల నిర్ణయాన్ని ప్రకటించగానే అనేక పుకార్లు షికార్లు చేశాయి. సమంతకు పిల్లలను కనడం నచ్చ లేదని, ఆమె స్కిన్ షోకు అక్కినేని ఫ్యామిలీ అభ్యంతరం చెబుతుందని, ఆమె అబార్షన్ చేయించుకుందని.. రకరకాల వార్తలను ప్రచారం చేశారు. వాటన్నింటికీ సమంత చెక్ పెట్టేసింది. అయినప్పటికీ సమంతను ఇప్పటికీ కొందరు నెటిజన్లు విమర్శిస్తూనే ఉన్నారు.
కాగా నాగార్జున, నాగచైతన్య నటించిన బంగార్రాజు మూవీ సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌ను సాధించింది. ఈ మూవీలో చైతూ సరసన ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి నటించి మెప్పించింది. త్వరలో చైతన్య లాల్ సింగ్ చడ్డా అనే హిందీ మూవీలో కనిపించనున్నాడు. ఇక సమంత యశోద, శాకుంతలం, కాతువాకుల రెండు కాదల్ అనే మూవీల్లో కనిపించనుంది. ఇటీవలే ఆమె పుష్ప లో ఐటమ్ సాంగ్ చేసి అలరించింది. అలాగే త్వరలో లైగర్ మూవీలోనూ సామ్ ఐటమ్ సాంగ్ చేయనుందని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…