Nagarjuna : నాగచైతన్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన తరువాత సమంతకు పెద్ద ఎత్తున విమర్శలు ఎదురయ్యాయి. ఆమెను చాలా మంది ట్రోల్ చేశారు. సమంత చెప్పినా వినడం లేదని, బోల్డ్ సీన్లలో నటించేందుకే ప్రాధాన్యతను ఇస్తుందని, అసలు ఆమెకు పిల్లల్ని కనడం ఇష్టం లేదని, అందువల్ల అబార్షన్ కూడా చేయించుకుందని.. ఇలా రకరకాల వార్తలు వచ్చాయి. వాటన్నింటిపై సమంత కోర్టు వరకు వెళ్లింది.
కోర్టు అలాంటి వార్తలను ప్రసారం చేసిన యూట్యూబ్ చానల్స్‌కు మొట్టికాయలు వేసింది. దీంతో క్షమాపణలతో సరిపెట్టారు. అప్పట్లో ఈ విషయం సంచలనంగా మారింది. అయితే తాజాగా నాగార్జున కూడా సమంత బాటలో నడవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు కారణం కూడా ఉంది.
ఇటీవల తాను ఎక్కడా మాట్లాడకున్నా.. చాలా మెయిన్ స్ట్రీమ్ వెబ్‌సైట్లు, చానల్స్‌లో తన మాటలుగా కొన్ని వార్తలను ప్రచురించారు. సమంతనే ముందుగా విడాకులు కావాలని అడిగిందని, అందుకు చైతన్య ఒప్పుకున్నాడని.. నాగార్జున చెప్పాడని.. వార్తలు వచ్చాయి. అయితే ఆ మాటలను తాను అనలేదని నాగార్జున తరువాత క్లారిటీ ఇచ్చారు. కానీ ఆ వార్తలపై నాగార్జున సీరియస్ అయ్యారని తెలుస్తోంది.
అసలు ఈ వార్తలను మొదట ఎవరు సృష్టించారో తెలుసుకోవాలని నాగార్జున తన టెక్నికల్ టీమ్‌కు పురమాయించారట. ఈ వార్తలను ముందుగా ఎవరు సృష్టించారు, ఎవరు ప్రచురించారు.. అనే విషయాలను తెలుసుకుని వారిపై పరువు నష్టం దావా వేయనున్నారని తెలుస్తోంది. అప్పట్లో సమంత కూడా ఇలాగే చేసినందున.. నాగార్జున కూడా అదేవిధంగా ముందుకు సాగాలని చూస్తున్నారట.
అయితే తప్పుడు వార్తలు అనుకుంటే.. చాలా మెయిన్ స్ట్రీమ్ మీడియా సంస్థలు ఆ వార్తలను ప్రచురించాయి కనుక అందరిపై పరువు నష్టం దావా వేయడం కుదరదు. అవి పుకారు వార్తల కిందకు వస్తాయి. కానీ కావాలని పనిగట్టుకుని ఎవరైనా సృష్టించి ఉంటే.. వారి గురించి తెలిస్తే.. అప్పుడు వారిపై లీగల్ చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. మరి ఆ వార్తలను క్రియేట్ చేసిన వారిని గుర్తిస్తారా.. లేదా.. అనేది చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…