Nagarjuna : టాలీవుడ్ క్యూట్ కపుల్‌గా పేరుగాంచిన నాగచైతన్య, సమంత విడిపోవడం ఎంతో మందిని షాక్‌కు గురి చేసింది. వారు అసలు విడాకులు ఎందుకు తీసుకున్నారో ఇప్పటికీ అర్థం కాని విషయం. అయితే మొత్తం వ్యవహారంలో ఇప్పటి వరకు సమంత తమ జీవితాలపై ఎన్నో కామెంట్స్ చేస్తూ సందేశాలు పెట్టింది. అలాగే ఈమధ్యే కాఫీ విత్ కరణ్ అనే షోలో పాల్గొని చాలా ఘాటు వ్యాఖ్యలు చేసింది. కరణ్ జోహార్ సమంత భర్త అని సంబోధిస్తే.. కాదు.. మాజీ భర్త అనాలని సూచించింది. అలాగే తమ ఇద్దరినీ ఒకే గదిలో పెడితే పదునైన వస్తువులను ఉంచకూడదని కామెంట్స్ చేసింది. అంటే సమంత, నాగచైతన్యలు ప్రేమికుల్లా ఉండి ఎంత బద్ద శత్రువులుగా మారారో.. ఆమె వ్యాఖ్యలను బట్టి ఇట్టే అర్థమవుతుంది.
అయితే ఈ మొత్తం వ్యవహారంలో నాగచైతన్య మొదటి నుంచి సైలెంట్‌గానే ఉన్నాడు. అలాగే థాంక్ యూ చిత్ర ప్రమోషన్లలో భాగంగా సమంత గురించి ప్రశ్నలు వచ్చినా ఆమె మంచిదని చాలా కూల్‌గానే సమాధానాలు చెప్పాడు. కానీ సమంత మాత్రం అతన్ని శత్రువుగానే చూస్తున్నట్లు కనిపిస్తోంది. దీంతో నీకు, మా హీరో చైతూకు ఎంతో తేడా ఉందని.. అక్కినేని ఫ్యాన్స్ ఆమెపై విమర్శల వర్షం కురిపించారు. అయితే నెటిజన్లు మాత్రం నాగచైతన్య జీవితం ఇలా అవడానికి కారణం నాగార్జుననే అని అంటున్నారు. ఆయన వల్లే చైతూ సమంతను కోల్పోయాడని అంటున్నారు. ఇక దీనికి కారణాలను కూడా చెబుతున్నారు.
నాగార్జున రెండు పెళ్లిళ్లు చేసుకున్న సంగతి తెలిసిందే. మొదటి భార్య లక్ష్మితో విడాకుల అనంతరం హీరోయిన్‌గా ఉన్న అమలను ఆయన వివాహం చేసుకున్నారు. తరువాత అఖిల్ జన్మించాడు. లక్ష్మికి అంతకు ముందే నాగచైతన్య పుట్టాడు. అయితే విడాకుల వల్ల చైతూ తల్లిదండ్రుల వద్ద కలసి పెరిగే అవకాశం లేకుండా పోయిందని.. దీంతో ఇద్దరితోనూ అటాచ్‌మెంట్ తక్కువేనని అంటున్నారు. ఈ క్రమంలోనే కుటుంబంలో ఎలా ఉండాలో చైతూకు తెలియదని.. అందువల్లే సమంతకు దూరమయ్యాడని అంటున్నారు. అదే ఇద్దరు తల్లిదండ్రుల వద్ద పెరిగి ఉంటే చైతన్య కథ మరోలా ఉండేదని.. సమంతకు సర్ది చెప్పో.. మరో రకంగానో ఇద్దరూ కలసి ఉండేవారని అంటున్నారు. ఈ క్రమంలోనే చైతన్య జీవితం ప్రస్తుతం ఇలా అయ్యేందుకు పరోక్షంగా నాగార్జున కూడా కారణమయ్యారని ఆరోపిస్తున్నారు. అయితే చైతూ, సమంతల భవిష్యత్తు ఏమవుతుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…