Ghost Movie : సీనియర్ హీరోలు అందరూ ఇప్పుడు సినిమాలు హిట్ కావాలని తీవ్రంగా శ్రమిస్తున్నారు. కానీ ఏం చేసినా సరే వారి సినిమాలు మాత్రం హిట్‌ను సాధించలేకపోతున్నాయి. ప్రస్తుతం కింగ్ నాగార్జున పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆయన ఈ మధ్య కాలంలో చేసిన అనేక చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. అయితే ఈమధ్యే ఆయన నటించిన బంగార్రాజు మూవీ వచ్చింది. ఇది హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే ఇది ఆయన పూర్తి స్థాయి చిత్రం కాదు. ఇందులో నాగచైతన్యకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. కనుక ఈ మూవీ చైతూ ఖాతాలోనే పడింది.
ఇక ఆయన నటించిన మన్మథుడు 2, వైల్డ్ డాగ్ సినిమాలు అయితే అడ్రస్ లేకుండా పోయాయి. ఈ క్రమంలోనే నాగార్జున మరోమారు ది ఘోస్ట్ పేరిట మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దీనికి ప్రవీణ్ సత్తారు దర్శకుడు. ఈ క్రమంలోనే ఈ మూవీ షూటింగ్‌ను అయితే ఎట్టకేలకు పూర్తి చేశారు. టీజర్ కూడా లాంచ్ కానుంది. ఇక చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలను ప్రారంభించాలని భావిస్తోంది. అయితే ఈ మూవీకి ఎలాంటి బజ్ లేదు. ప్రేక్షకుల్లో అంత ఆసక్తి కూడా లేదు. ఆయన గత చిత్రం వైల్డ్ డాగ్ లాగే ది ఘోస్ట్ కూడా ఉంటుందని అంటున్నారు. ఈ క్రమంలోనే సినిమాకు ఎలాంటి బజ్ లేకపోవడంపై నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు.
అయితే ప్రస్తుత తరుణంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా నాగ్ ది ఘోస్ట్ సినిమాను నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. కానీ ముందుగా చిత్రంపై కాస్త బజ్ పెంచుతారని తెలుస్తోంది. దీంతో కాస్త ఎక్కువ ధరకే ఓటీటీ సంస్థలు ఈ మూవీని కొనేందుకు ఆసక్తిని చూపిస్తాయి. అందులో భాగంగానే అమెజాన్, నెట్ ఫ్లిక్స్ వంటి ఓటీటీ సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఘోస్ట్ మూవీ నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అవుతుందని అంటున్నారు. అసలే పరిస్థితులు బాగా లేవు. థియేటర్లలో రిలీజ్ చేసి నష్టాలను ఎందుకు చవిచూడాలి.. అనుకుంటున్నారో ఏమో.. ఘోస్ట్ మూవీని ఓటీటీలో రిలీజ్ చేసేందుకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై త్వరలోనే వివరాలను వెల్లడించనున్నారని సమాచారం.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…