Nagababu : రివేంజ్ తీర్చుకునేందుకు ఎదురు చూస్తున్న నాగ‌బాబు..? ఇంత‌కీ ఎవ‌రిపై..?

Nagababu : నాగ‌బాబు ఈ మ‌ధ్య కాలంలో ఎక్కువ‌గా వార్త‌ల్లో నిలుస్తున్నారు. మా ఎన్నిక‌లు జ‌రిగిన‌ప్ప‌టి నుంచి నాగ‌బాబు వివాదాల‌కు కేరాఫ్‌గా నిలుస్తూ వ‌చ్చారు. ఇటీవల త‌న కుమార్తె నిహారిక విష‌యంలో ఆయ‌న కాస్త ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. అయితే త‌న కుమార్తె త‌ప్పు ఏమీ లేదని.. అయినా ఆమె అంత అర్థ‌రాత్రి పూట ప‌బ్‌కు వెళ్ల‌డం వల్ల నింద‌లు మోయాల్సి వ‌స్తుంద‌ని నాగ‌బాబు విచారం వ్య‌క్తం చేశారు. కానీ కొంత‌కాలం పాటు ఈ టాపిక్ గురించి మాట్లాడుకుంటారు. త‌రువాత ష‌రా మామూలే అన్నట్లుగా జ‌రుగుతుంది. అయితే సందట్లో స‌డేమియాలా.. నాగ‌బాబుకు ఒక మంచి ఆఫ‌ర్ వ‌చ్చింద‌నే చెప్పాలి. తాను ఎంతో కాలం నుంచి రివేంజ్ తీర్చుకునే స‌మ‌యం ఇప్పుడు ఆస‌న్న‌మైంద‌ని అంటున్నారు. ఇంతకీ అస‌లు విష‌యం ఏమిటంటే..

Nagababu

జ‌బ‌ర్ద‌స్త్ షో ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి గ‌త కొంత కాలం కింద‌టి వ‌ర‌కు నాగ‌బాబు, రోజాలే జ‌డ్జిలుగా ఉన్నారు. అయితే ఏం జరిగిందో తెలియ‌దు కానీ.. నాగ‌బాబు జ‌బ‌ర్ద‌స్త్‌కు గుడ్ బై చెప్పి బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. త‌రువాత ఇత‌ర టీవీ చాన‌ల్స్‌లో ఒక‌టి రెండు కామెడీ షోల‌ను ప్రారంభించారు. స్వ‌యంగా అన్నీ తానే అయి ఆ షోల‌ను నిర్వ‌హించారు. కానీ ఆయన అనుకున్న ఫ‌లితం రాలేదు. జ‌బ‌ర్ద‌స్త్ నుంచి కొంద‌రు క‌మెడియ‌న్ల‌ను ఆయ‌న త‌న‌తోపాటు బ‌య‌టకు తీసుకెళ్లారు. కానీ ఎంత ప్ర‌య‌త్నించినా.. ఆయ‌న చేసిన షోస్ జ‌బ‌ర్ద‌స్త్‌కు పోటీ ఇవ్వ‌లేక‌పోయాయి. అయితే అది గ‌తం. కానీ ఇప్పుడు ఇదే షో ఆయ‌న‌కు ఓ స‌రికొత్త అవ‌కాశం క‌ల్పించిన‌ట్లు అయింది.

నిన్న మొన్న‌టి వ‌ర‌కు రోజా ఉన్న కార‌ణంగా ఈ షోను నాగ‌బాబు ట‌చ్ చేయ‌లేక‌పోయారు. కానీ ఇప్పుడు ఆమె లేరు. క‌నుక ఈ షోపై.. దాని నిర్వాహ‌కుల‌పై రివేంజ్ తీర్చుకునేందుకు స‌రైన స‌మ‌యం వ‌చ్చింద‌ని అంటున్నారు. ఎటూ రోజా లేరు క‌నుక‌.. నాగ‌బాబు ఇప్పుడు తాను అనుకున్న ప‌ని చేయ‌వ‌చ్చ‌ని.. జ‌బ‌ర్ద‌స్త్ పై రివేంజ్ తీర్చుకునే స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని అంటున్నారు. అదే జ‌రిగితే జ‌బ‌ర్ద‌స్త్ క‌నుమ‌రుగు అవడ‌మో.. లేదా నాగ‌బాబుకు చుక్కెదురు అవ‌డ‌మో జరుగుతుంది. కానీ జ‌బ‌ర్ద‌స్త్ షోకు ఇప్ప‌టికీ ఆద‌ర‌ణ త‌గ్గ‌లేదు. అందులో సుడిగాలి సుధీర్‌, హైప‌ర్ ఆది ఉన్నంత వ‌ర‌కు ఆ షోకు ఢోకా లేదు. క‌నుక నాగ‌బాబు ఇప్ప‌టిక‌ప్పుడు రంగంలోకి దిగినా జ‌బ‌ర్ద‌స్త్ షోను ఏమీ చేయ‌లేర‌ని కొంద‌రు అంటున్నారు. అయితే ఆయ‌న రివేంజ్ తీర్చుకునేందుకు ఎదురు చూస్తున్నారని.. క‌నుక ఇప్పుడు స‌రైన స‌మ‌యం ల‌భించింద‌ని.. కాబ‌ట్టి ఇప్పుడు ఏమైనా జ‌ర‌గ‌వ‌చ్చ‌ని అంటున్నారు. మ‌రి ఈ విష‌యంలో ఏం జ‌రుగుతుందో చూడాలి.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM