Thank You Movie : లవ్ స్టోరీ, బంగార్రాజు మూవీలతో వరుస హిట్స్ కొట్టిన నాగచైతన్య.. థాంక్ యూ చిత్రంతో డీలా పడిపోయాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ టాక్‌ను తెచ్చుకుంది. మూవీ రిలీజ్ అయిన రెండో రోజే వసూళ్లు దారుణంగా పడిపోయాయి. ఈ క్రమంలోనే నాగచైతన్య కెరీర్‌లో థాంక్ యూ మూవీ ఒక అట్టర్ ఫ్లాప్ డిజాస్టర్ చిత్రంగా నిలిచిపోయింది. ఇక మూవీ బాగుంటేనే 4 వారాల్లో ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. అదే ఫ్లాప్ అయితే ఇంకా త్వరగానే ఓటీటీల్లోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే థాంక్ యూ మూవీ కూడా చాలా త్వరగా ఓటీటీలోకి వస్తోంది.
థాంక్ యూ మూవీకి గాను డిజిటల్ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఇక ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ మూవీని 3 వారాల్లో ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. మూవీ జూలై 22న రిలీజ్ అయింది. కనుక ఆగస్టు 12వ తేదీన ఓటీటీలోకి వస్తుందని తెలియజేశారు. బహుశా నాగచైతన్య కెరీర్‌లోనే ఇలా ఏ చిత్రానికి ఇంతలా అవమానం జరగలేదేమో. కానీ థాంక్ యూ ద్వారా ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నాడు.
ఇక థాంక్ యూ మూవీలో చైతూకు జోడీగా రాశిఖన్నా, మాళవికా నాయర్, అవికా గోర్‌లు నటించారు. దీనికి మనం ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించారు. అయితే థియేటర్లలో ఫ్లాప్ అయిన ఈ మూవీ ఓటీటీలో అయినా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో.. లేదో.. చూడాలి. కాగా చైతన్య ఇదే నెలలో ఇంకో మూవీతో మళ్లీ ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఈయన నటించిన లాల్ సింగ్ చడ్డా అనే హిందీ మూవీ ఇదే నెలలో రిలీజ్ కానుంది. హిందీలో చైతూకు ఇదే తొలి మూవీ. కాగా ఇందులో ఆయన పాత్ర నిడివి 15 నిమిషాల పాటు ఉంటుందని తెలుస్తోంది. ఇక ఇందులో చైతన్య ఎలా అలరిస్తాడో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…