Naga Chaitanya : యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య వరుస హిట్లతో జోరు మీదున్నాడు. ఈయన నటించిన గత 4 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఈ క్రమంలోనే చైతూ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. అయితే వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నా.. చైతూ సినిమా కెరీర్ కు మాత్రం ఎలాంటి ఢోకా లేదనే చెప్పాలి. యంగ్ హీరోల్లో చైతన్యకు ఉన్న సక్సెస్ రేట్ ప్రస్తుతం ఏ హీరోకు లేదనే చెప్పాలి. ఇక సినిమాలు వరుసగా హిట్ అవుతుండడంతో చైతన్య ప్రస్తుతం తన రెమ్యునరేషన్‌ను కూడా బాగానే పెంచినట్లు వార్తలు వస్తున్నాయి.
చైతన్య.. మజిలీ, వెంకీ మామ, లవ్ స్టోరీ, బంగార్రాజు చిత్రాల ద్వారా ప్రేక్షకులను అలరించాడు. వీటిల్లో వెంకీ మామ ఒక మోస్తరుగా నడిచినా కలెక్షన్లను బాగానే రాబట్టింది. ఇక మిగిలిన మూవీలు ఘన విజయాలను సాధించాయి. వీటిల్లో మజిలీ, లవ్ స్టోరీ సోలో చిత్రాలు కాగా.. వెంకీ మామ, బంగార్రాజు చిత్రాలు మల్టీ స్టారర్ మూవీలు. ఈ క్రమంలోనే చైతూ ఈ నాలుగు సినిమాలు అందించిన విజయాలతో ఇప్పుడు సక్సెస్ జోష్ మీదున్నాడు. ఇక త్వరలోనే థాంక్ యూ మూవీ ద్వారా మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు.
అయితే చైతన్య రెమ్యునరేషన్ విషయానికి వస్తే.. మజిలీ మూవీకి గాను ఆయన రూ.6 కోట్ల మేర పారితోషికం అందుకున్నారట. ఇక ఆ తరువాత చేసిన మూవీలకు కూడా రూ.6 కోట్ల నుంచి రూ.8 కోట్ల మధ్యలో రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా దిల్ రాజు బ్యానర్‌పై విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చేసిన థాంక్ యూ సినిమాకి గాను చైతూ రూ.10 కోట్ల వరకు రెమ్యునరేషన్‌ను అందుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా కేవలం 2 ఏళ్ల వ్యవధిలోనే చైతూ రెమ్యునరేషన్ డబుల్ కావడం విశేషం.
ఇక చైతూ నటించిన థాంక్ యూ మూవీ ఈ నెల 22వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. ఇందులో రాశి ఖన్నా హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఈ మూవీ కూడా హిట్ అవుతుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…