Naga Chaitanya : నాగచైతన్య ఒక భిన్నమైన మనస్తత్వం కలిగిన వాడని చెప్పవచ్చు. ఇతర హీరోలకు ఆయన పూర్తిగా భిన్నం. తన పనేదో తాను చూసుకుంటాడు తప్ప ఇతరుల విషయాల్లో అసలు జోక్యం చేసుకోడు. వివాద రహితుడు. సౌమ్యుడిగా పేరుగాంచాడు. సినిమా షూటింగ్స్‌లో పాల్గొనడం.. ప్రమోషన్స్ చేయడం.. రిలీజ్ వేడుకల్లో పాల్గొనడం.. సక్సెస్ అయితే సెలబ్రేట్ చేసుకోవడం.. ఇదీ చైతూ సాధారణ లైఫ్ స్టైల్. సమంతతో విడిపోక ముందు అలాగే ఉన్నాడు. విడిపోయాక కూడా అలాగే ఉన్నాడు. పెద్దగా మార్పు లేదు. కాకపోతే ఎన్నో ఏళ్ల పాటు ప్రేమించిన యువతి దూరమైందన్న బాధ అయితే ఉంటుంది. కానీ చైతన్య ప్రస్తుతం తన కెరీర్ మీదే ఎక్కువగా ఫోకస్ పెట్టాడు.
విడాకుల అనంతరం సమంతపై నెగెటివిటీ బాగా వచ్చింది. కానీ చైతన్యపై అంత పెద్ద విమర్శలు రాలేదు. కేవలం సమంత ఫ్యాన్స్ మాత్రమే చైతన్యను విమర్శించారు. కానీ అది తక్కువేనని చెప్పవచ్చు. కానీ చైతన్యకు విడాకులు ఇచ్చినందుకు అతని కన్నా సమంతనే ఎక్కువగా విమర్శల పాలైంది. కారణం అందరూ ఊహించిందే.. ఆమె చేసే బోల్డ్ షోనే అన్నింటికీ మూలకారణమని సులభంగా చెప్పవచ్చు. అయితే గతం గతః. ఇద్దరూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. కానీ ఈ మధ్య కాలంలో వచ్చిన ఒక వార్తకు చైతూ బాగా డిస్టర్బ్ అయి ఉంటాడని అనుకున్నారు. కానీ అలాంటిదేమీ లేదని అర్థమవుతోంది. ఎందుకంటే.. రూమర్స్ గురించి పట్టించుకుంటే అది ఎంత వరకు వెళ్తుందో బాగా తెలుసు. కాబట్టి వాటిని పట్టించుకోకూడదు. చైతూ కూడా అలాగే చేశాడు.
ఎవరెన్ని కామెంట్స్ చేసినా.. ఎన్ని వార్తలు వచ్చినా చైతూ మాత్రం సైలెంట్‌గా ఉన్నాడు. అదే మంచిది. ఏదైనా ట్వీట్ చేసినా లేదా పోస్ట్ పెట్టినా.. అది ఇంకా వివాదం అవుతుంది. కనుక అనవసరంగా బ్యాడ్ అవడం ఎందుకు అనుకున్నాడో ఏమో.. కానీ చైతూ మాత్రం తనపై రీసెంట్‌గా వస్తున్న పుకార్లపై అసలు స్సందించలేదు. తన సినిమాలపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టాడు. నాకు ఇంకా ఏమీ పనిలేదా.. ఇలాంటి వార్తలపై స్పందించాలా.. అన్నట్లుగా చైతన్య అసలు ఆ వార్తలను పట్టించుకోనే లేదు. లేదంటే ఈపాటికి స్పందించి ఉండేవాడు.
ఇక పుకారు వార్తలపై సైలెంట్‌గా ఉన్న చైతూ సినిమాలపై మాత్రం దృష్టి పెట్టాడు. అందులో భాగంగానే ఆయన ప్రస్తుతం థాంక్ యూతోపాటు లాల్ సింగ్ చడ్డా సినిమాల ప్రమోషన్‌లో బాగా బిజీగా ఉన్నాడు. అయితే రానున్న రోజుల్లో అయినా చైతూ తనపై వస్తున్న వార్తలకు స్పందిస్తాడో.. లేదో.. చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…