Naga Chaitanya : అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం వరుస హిట్స్, వరుస సినిమాలతో మంచి ఫామ్ లో ఉన్నాడు. సమంతతో విడాకుల తర్వాత చైతూ సినిమాలతో బిజీగా అయిపోయాడు. అక్కినేని కుటుంబ నేపథ్యం ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు నాగచైతన్య. వాసు వర్మ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా జోష్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన చైతూ.. తొలి సినిమా ద్వారా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాడు.
అయితే తర్వాత తనని తాను మార్చుకుంటూ లవ్ స్టోరీలు, మాస్ మూవీస్‌తో ప్రేక్షకులకు ఆకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలోనే విజయాలతోపాటు అపజయాలు సైతం ఎదుర్కొన్నాడు చైతన్య. తాజాగా లాంగ్ సింగ్ చడ్డా సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చాడు. అయితే తన కెరీర్‌లో ఎదుర్కొన్న ఓ చేదు సంఘటనను అభిమానులతో పంచుకున్నాడు చై. లాల్ సింగ్ చడ్డా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్వ్యూ ఇచ్చిన చైతన్య ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు.
జోష్ మూవీ విడుదల సమయంలో ఎదురైన అనుభవాన్ని పంచుకున్న నాగచైతన్య.. జోష్ సినిమా విడుదలైనప్పుడు ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి థియేటర్‌కు వెళ్లాను. మూవీ ప్రారంభమైనప్పుడు అందరూ బాగానే ఎంజాయ్ చేశారు. కానీ సినిమా సగానికి వచ్చేసరికి చాలా మంది థియేటర్ నుంచి బయటకు వెళ్లిపోవడం గమనించాను. ఆ సమయంలో నాకు చాలా బాధేసింది, అది నా హృదయాన్ని గట్టిగా తాకింది. ప్రేక్షకుల్ని మెప్పించడం నా వల్ల కాదనిపించింది. ఆ సంఘటన నాకెన్నో విషయాలను నేర్పించింది.
ఇక ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ థియేటర్‌కు వెళ్లలేదు. కానీ ఏదో ఒకరోజు తప్పకుండా థియేటర్‌కు వెళ్లి.. ప్రేక్షకుల రియాక్షన్‌ని ఎంజాయ్ చేయాలనుకుంటా.. అని చెప్పుకొచ్చాడు చైతన్య. వరుసగా విడుదలైన చైతూ థాంక్యూ, లాల్ సింగ్ చడ్డా నిరుత్సాహపరిచినా రానున్న రోజుల్లో క్రేజీ ప్రాజెక్ట్స్ తో అభిమానులను అలరించనున్నాడు అక్కినేని వారసుడు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…