Naga Chaitanya : ఇటీవలి కాలంలో బాలీవుడ్ మీడియా టాలీవుడ్ స్టార్స్‌పై ఎక్కువగా దృష్టి పెడుతోంది. వారి పర్సనల్, ఫ్రొషెషనల్ లైఫ్‌కి సంబంధించిన విషయాలని ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. గత కొద్ది రోజులుగా నాగ చైతన్య రెండో పెళ్లికి సంబంధించి పలు కథనాలు రాసుకొస్తున్నారు. గత ఏడాది అక్టోబర్ 2వ తేదీన సమంత, నాగచైతన్య విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే నాగచైతన్య మరో పెళ్ళికి సిద్ధం అవుతున్నారని తెలుస్తోంది. అది కూడా ఒక హీరోయిన్ తో అని ప్రచారం జరుగుతోంది. అయితే సదరు హీరోయిన్ ఎవరనే దానిపై క్లారిటీ లేదు కానీ ప్రచారం మాత్రం ఊపందుకుంది.
సమంత నుండి విడిపోయిన తర్వాత చైతన్య ఒంటరిగా ఉన్నాడని వార్తలు వచ్చాయి. త్వరలో పెళ్లి చేసుకోవచ్చని కొన్ని రిపోర్టులు చెబుతున్నాయి. ఈ వార్తలను నాగ చైతన్య టీమ్ ఖండించింది. నిజానికి నాగ చైతన్య, సమంతల విడాకుల లీగల్ ఫార్మాలిటీస్ ఇంకా పూర్తి కాలేదు. కాబట్టి.. పునర్వివాహం గురించి మాట్లాడటం అసంబద్ధం. నాగ చైతన్య తొలి హిందీ చిత్రం లాల్ సింగ్ చద్దా త్వరలో థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలో నాగ చైతన్య బాలీవుడ్‌లో అలాంటి పుకార్లను ఎదుర్కోవలసి వస్తోంది.
గతేడాది అక్టోబర్ నెలలో అక్కినేని సమంత, నాగ చైతన్య విడిపోతున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. అప్పటినుంచి వేరు వేరుగా ఉంటూ తమ తమ ప్రొఫెషనల్ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. అటు సమంత వరుస సినిమాలకు కమిటవుతుంటే ఇటు నాగ చైతన్య తన ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉన్నారు. ఈ పరిస్థితుల నడుమ మళ్ళీ నాగ చైతన్య రెండో పెళ్లి అనే టాపిక్ జనాల్లో హాట్ ఇష్యూ అయింది. ఎప్పుడైతే విడాకుల ప్రకటన చేశారో అప్పటినుంచి వీరిద్దరి వ్యక్తిగత విషయాలపై ఎన్నో రూమర్స్ బయటకొచ్చాయి. అక్కినేని ఫ్యామిలీ కండిషన్స్, సమంత బిహేవియర్ అంటూ బోలెడన్ని పుకార్లు షికార్లు చేశాయి. అయితే ఇటు సమంత గానీ, అటు అక్కినేని ఫ్యామిలీ గానీ వీటన్నింటీ పెద్దగా పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే నాగచైతన్య రెండో పెళ్లి అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని తేలిపోయింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…