ఇప్పటి వరకు టాలీవుడ్‌లో అలరించిన అక్కినేని యువ సామ్రాట్ నాగ చైతన్య లాల్ సింగ్ చడ్డా సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టాడు. ఈ సినిమా హిట్ అయితే చైతూకి వరుసగా బాలీవుడ్ ఆఫర్స్ రావడం ఖాయం. భారతదేశం గర్వించదగ్గ డైరెక్టర్స్ లో ఒకరైనా సంజయ్ లీలా భన్సాలీ ఇటీవలే గంగూబాయి కతియావాడితో మరో సూపర్ హిట్ అందుకున్నారు. ఆలియా భట్ ఈ సినిమాతో నటనలో మరో మెట్టు ఎక్కింది.
అయితే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ.. నాగచైతన్యతో చేతులు కలుపనున్నట్లు తెలుస్తోంది. తాజాగా చైతన్య, సంజయ్ భన్సాలీని కలిశాడట. వీరిద్దరి కలయికలో ఓ మూవీ కోసం చర్చలు జరిగినట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. అయితే గతంలో పుష్ప రిలీజ్ తరువాత.. అల్లు అర్జున్ కూడా సంజయ్ ను కలిశారు. వీరిద్దరూ ఓ సినిమా చేయబోతున్నారని అనుకున్నారు. కానీ ఇంత వరకూ ఎలాంటి అనౌన్స్ మెంట్ రాలేదు.
ప్రస్తుతం నాగచైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సినిమా లాల్ సింగ్ చడ్డా ఆగస్టు 11న విడుదల కానుంది. అమీర్ ఖాన్ హీరోగా, కరీనా కపూర్ ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమాను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్నారు. దీనితో పాటుగా నాగ చైతన్య.. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో దూత అనే హార్రర్ వెబ్ సిరీస్‌ను చేస్తున్నాడు. లవ్ స్టోరీ, బంగార్రాజు వంటి వరుస సక్సెస్ లతో జోరు మీదున్నాడు చైతూ. అయితే నాగచైతన్య స్పీడ్‌కు ఈ మధ్యే థాంక్యూ మూవీ బ్రేక్‌లు వేసింది. భారీ అంచనాలతో జూలై 22న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. దీంతో బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్ గా నిలిచింది. మరి ఆయన బాలీవుడ్‌లో ఏ మేర రాణిస్తారో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…